South Korea: కజకిస్తాన్ విమానం ఘటన మరవక ముందే, దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 179 మంది విమాన ప్రయాణీకులు మరణించారు. బోయింగ్ 737-800 విమానంలో వరసగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రన్ వే నుంచి వేగంగా వెళ్లి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విమానం అంతా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో అధికారులు ఇద్దరి ప్రాణాలు కాపాడారు.
విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగా, ‘‘బెల్లీ ల్యాండింగ్’’ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. విమానం పొట్ట భాగం రన్ వేపై ఉంది. దీంతో ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణం తెరుచుకోకపోవడంతోనే పైలట్ ఈ విధంగా చేసినట్ల తెలుస్తోంది. ఎయిర్ పోర్టు అధికారులను ఉటంకిస్తూ యోన్‌హాప్ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. సాధారణ ల్యాండింగ్ విఫలం కావడంతో పైలట్ క్రాష్ ల్యాండింగ్‌కి ప్రయత్నించినట్లు తెలిపింది. విమానాన్ని అంతకుముందే ‘‘పక్షి’’ ఢీకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పక్షి ఢీకొట్టిన తర్వాతే ఒకదాని వెనక ఒకటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం, బెల్లీ ల్యాండింగ్ ప్రమాదానికి కారణమయ్యాయి. “విమానం యొక్క ల్యాండింగ్ గేర్, టైర్లు వంటివి యాక్టివేట్ కాలేదని, బహుశా క్రాష్ ల్యాండింగ్‌కు ప్రయత్నించి ఉండొచ్చు బహుశా ఇదంతా పక్షి ఢీకొనడం వల్ల పనిచేయకపోవడం వల్ల కావచ్చు” అని నివేదిక పేర్కొంది.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి రోల్.. ఇప్పటి దాకా ప్రచారం అంతా ఉత్తిదే
ఇదిలా ఉంటే, పలువురు నెటిజన్లు విమానాశ్రయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 కి.మీ కంటే తక్కువ పొడవు ఉన్న రన్ వే పై బెల్లీ ల్యాండింగ్ జరిగితే, అగ్నిమాపక సిబ్బంది ఎందుకు పొజిషన్ తీసుకోలేదని ప్రశ్నించారు. విమానం బెల్లీ ల్యాండింగ్‌కి ప్రయత్నించే ముందు ఎలాంటి చక్కర్లు కొట్టలేదని విమానం యొక్క ట్రాజెక్టరీ సూచిస్తోందని మరొకరు ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో విమానం తన స్పీడ్, ఎత్తుని తగ్గించుకునేందుకు ఇలాంటి ప్రక్రియల్ని పైలట్ చేస్తుంటారు.
మువాన్ అగ్నిమాపక కేంద్రం చీఫ్ లీ జియోంగ్-హ్యూన్ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణం బాగా లేకపోవడం విషాదానికి దోహదపడింది. “ప్రమాదానికి కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు పక్షి ఢీకొని ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఉమ్మడి విచారణ తర్వాత ఖచ్చితమైన కారణాన్ని ప్రకటిస్తాము” అని ఆయన చెప్పారు. తక్కువ ధరలకు విమాన ప్రయాణాన్ని కల్పించి జెజు ఎయిర్ క్రాష్ ప్రమాదంపై క్షమాపణలు చెప్పింది.
🚨 BREAKING VIDEO: New video shows moment Boeing 737-800 plane carrying 181 people onboard crashes at Muan International Airport in South Korea. #Breaking #Muan #SouthKorea
pic.twitter.com/6aBHyRyrF9— Breaking News Video (@BreakingAlerter) December 29, 2024