Delhi: పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Bangladesh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నివాళి అర్పించారు. భారత్‌కి రెండుసార్లు ప్రధానిగా చేసిన, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరుతెచ్చుకున్న మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో మరణించారు. మంగళవారం ఢాకాలోని భారత హైకమిషన్‌లో యూనస్, మన్మోహన్ సింగ్‌కి నివాళులు తెలియజేశారు. ‘‘ఎంతో సాదాసీదాగా ఉండేవారు, చాలా తెలివైనవారు’’ అని యూనస్, మన్మోహన్ సింగ్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.
Online Love: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి తన ప్రేయురాలిని కలిసేందుకు భారత్-పాక్ సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్లి అరెస్ట్ అయ్యాడు. యూపీ అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన మహిళతో స్నేహం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, గోవాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టూరిస్ట్ హత్యకు గురువ్వడం సంచలనంగా మారింది. బీష్ షాక్ సిబ్బంది, సమయం దాటిందని ఫుడ్ ఆర్డర్ తీసుకోమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు ఫుడ్ ఆర్డర్ వివాదంలో టూరిస్ట్ గ్రూప్‌కి బీష్ షాక్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం నెలకొంది.
Hamas Attack On Israel: అక్టోబర్ 07, 2023న గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భీకర దాడి చేశారు. ఒకేసారి వందలాది రాకెట్లను ప్రయోగించడంతో పాటు హమాస్ మిలిటెంట్ ఇజ్రాయిల్ కంచెను దాటి సరిహద్దు గ్రామాల్లో మారణహోమం సృష్టించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందర్ని దారుణంగా చంపేశారు.
Covid 19: ఇప్పుడున్న జనరేషన్ కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్ర కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది. అయితే, వైద్యం అభివృద్ధి చెందడంతో చాలా ఏళ్లుగా మహమ్మారి అనే పేరు వినిపించలేదు. అయితే, 2019లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్, కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. తొ
Manipur Violence: 2023 మే నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల సంఘర్షణతో అట్టుడుకుతోంది. హింసలో దాదాపుగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ, కుకీల మధ్య నెలకొన్న హింసపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాష్ట్ర ప్రజల్ని క్షమాపణలు కోరారు. గతాన్ని ‘‘క్షమించండి, మరిచిపోంది’’ అని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
BJP: ఢిల్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై బీజేపీ దాడి ప్రారంభించింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆలయ పూజారులకు, గురుద్వారా గ్రాంథీలకు ప్రతీ నెలా రూ. 18,000 ఇస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన తర్వాత.. ‘‘ ఎన్నికల హిందువు’’ అంటూ బీజేపీ విమర్శలు ప్రారంభించింది.
Pinarayi Vijayan: ‘‘కేరళ మిని పాకిస్తాన్’’ అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ‘‘ తీవ్రమైన హానికరమైనవి’’, ‘‘పూర్తిగా ఖండించదగినది’’ అని అభివర్ణించారు.
Plane Crash: కజకిస్తాన్‌లో అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.