West Bengal: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా భావించే టీఎంసీ నేతని దుండగులు గురువారం కాల్చి చంపారు. మాల్దాలో ఈ ఘటన జరిగింది.
India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియన వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్‌పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్‌లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం.
Bihar: ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి నితీష్ కుమార్ సారథ్యం జేడీయూ-బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ పార్టీలు కలిసి అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీష్ కుమార్‌కి తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని అన్నారు.
Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటన తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణమైంది. 19 ఏళ్ల యువతిపై వర్సిటీ క్యాంపస్‌లోనే లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి అధికార డీఎంకే పార్టీలో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. అధికార ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీతో పాటు అన్నాడీఎంకే పార్టీలు మండిపడుతున్నాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తుందని గురువారం ఆరోపించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ ప్లాన్ కేంద్రం యొక్క ‘‘నీచమైన బ్లూ ప్రింట్’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని ఆరోపించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు’’ బెంగాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కొన్ని రోజుల క్రితం కేంద్ర […]
Nimisha Priya case: హత్య ఆరోపణలపై యెమెన్ దేశంలో మరణశిక్ష విధించబడిన భారతీయ మహిళ నిమిషా ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ‘‘ మానవతా కారణాల’’ దృష్ట్యా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉణ్నట్లు ఇరాన్ సీనియర్ అధికారి గురువారం తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి.
Jharkhand: భార్యతో గొడవ భర్తతో పాటు మరో నలుగురి ప్రాణాలను తీసింది. బావిలో దూకిన వ్యక్తిని రక్షించేందుకు యత్నించిన మరో నలుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. సుందర్ కర్మాలి(27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడిన తర్వాత బావిలో దూకాడు.
Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌కి చెందిన 25 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ తన తల్లిదండ్రుల్ని హత్య చేశారు. కెరీర్, చదువు విషయంలో తల్లిదండ్రులతో విభేదాలు రావడంతోనే హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Rajasthan Borewell Incident: రాజస్థాన్ బోర్వెల్ ఘటనపై యావత్ దేశం ఆసక్తిగా ఉంది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడేళ్ల చేతన అనే బాలికని 10 రోజుల తర్వాత అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 150 అడుగులలో చిక్కుకుపోయిన బాలికను రక్షించేందు అధికారులు శతవిధాల ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.