Christmas Cake: బ్రెజిల్‌లో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. క్రిస్మస్ కేకులో అత్యంత విషపూరితమైన ‘‘ఆర్సెనిక్’’ని కలిపి ముగ్గురిని చంపేసింది. 61 ఏళ్ల వృద్ధురాలు క్రిస్మస్ కోసం స్వయంగా కేక్ తయారు చేసింది. బ్రెజిల్ దక్షిణ రాష్ట్రమయిన రియో గ్రాండే డో సుల్‌లోని టోర్రెస్‌కి చెందిన టెరెజిన్హా సిల్వా డోస్ అంజోస్ అనే మహిళ కేసు తయారు చేసే సమయంలో ఆర్సెనిక్ కలిపింది.
Read Also: July 2024 Movie Roundup: నెలంతా రాజ్ తరుణ్-లావణ్య పంచాయితీ.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్
దీనిని తిన్న ముగ్గురు మహిళలు 43 ఏళ్ల టటియానా డెనిజ్ సిల్వా డోస్ అంజోస్, 58 ఏళ్ల మైదా బెరెనిస్ ఫ్లోర్స్ డా సిల్వా, 65 ఏళ్ల న్యూజా డెనిజ్ సిల్వా డాస్ అంజోస్ మరణించారు. మరో మహిళతో పాటు, 10 ఏళ్ల బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు శరీరాల్లో కూడా ఆర్సెనిక్ ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మహిళ భర్త కూడా ఆర్సెనిక్ విషంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించాడు. ప్రస్తుతం ఈ మరణానికి కూడా మహిళతో సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్సెనిక్ అనేది ఒక లోహ మూలకం. ఇది ఇన్ఆర్గానిక్ ఫామ్‌లో అత్యంత విషపూరితమైంది. ఇది కేటగిరీ వన్ క్యాన్సర్ కారణంగా వర్గీకరించబడింది.