Jharkhand: భార్యతో గొడవ భర్తతో పాటు మరో నలుగురి ప్రాణాలను తీసింది. బావిలో దూకిన వ్యక్తిని రక్షించేందుకు యత్నించిన మరో నలుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. సుందర్ కర్మాలి(27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడిన తర్వాత బావిలో దూకాడు.
Read Also: Nagpur: తల్లిదండ్రుల్ని హత్య.. చదువు విషయంలో విభేదాలే కారణం..
కోపంతో తన మోటార్ సైకిల్‌ని బావిలోకి పోనిచ్చాడు. సుందర్ కర్మాలి బావిలో పడిన తర్వాత, అతన్ని రక్షించే ప్రయత్నంలో మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. అయితే, విషాదకరంగా మొత్తం ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ తెలిపారు. మృతులను రాహుల్ కర్మాలి (26), వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి , సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.