West Bengal: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా భావించే టీఎంసీ నేతని దుండగులు గురువారం కాల్చి చంపారు. మాల్దాలో ఈ ఘటన జరిగింది. రెండు బైకులపై వచ్చిన దుంగలు ఝల్‌ఝలియా మోర్ ప్రాంతంలో దులాల్ సర్కార్ అలియాస్ బబ్లాని తుపాకీతో కాల్చారు. అత్యంత సమీపం నుంచి జరిగిన కాల్పుల్లో బబ్లా తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు డాక్లర్లు వెల్లడించారు. అయితే, ఈ హత్య వెనక ఉద్దేశం ఇంకా తెలియరాలేదు.
Read Also: Minister Seethakka: రేపు ప్రజాభవన్‌లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభం..
బబ్లా మృతిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘నా సన్నిహితుడు మరియు చాలా ప్రజాదరణ పొందిన నాయకుడు, బాబ్లా సర్కార్ ఈ రోజు హత్య చేయబడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రారంభం నుండి, అతను (మరియు అతని భార్య చైతాలి సర్కార్) పార్టీ కోసం కష్టపడి పనిచేశాడు, బబ్లా కూడా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చైతాలికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
నిందితులు బబ్లాని వెంబడించి, దుకాణంలోకి వెళ్లిన అతడిపై కాల్పులు జరిపి..పారిపోయినట్లు సీసీటీవీ విజువల్స్‌లో కనిపిస్తోంది. దర్యాప్తు ప్రారంభించామని, నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.