Cafe Owner Suicide: ఢిల్లీ కేఫ్ ఓనర్ 40 ఏళ్ల పునీత్ ఖురానా ఆత్మహత్య సంచలనంగా మారింది. ఇటీవల బెంగళూర్‌లో ఆత్మహత్ చేసుకున్న అతుల్ సుభాష్ లాగే పునీత్ భార్య, అతడి కుటుంబం వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన సూసైడ్ చేసుకునేందుకు ముందు రికార్డ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. భార్య మాణికా పహ్వా, అత్తమామలపై సంచలన ఆరోపణలు చేశారు. వీరంతా కలిసి తనను మానసికంగా హింసించారని, అసమంజసమైన డిమాండ్‌లతో తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు.
పరస్పర అంగీకారంతో ప్రారంభమైన విడాకుల ప్రక్రియా తన భార్య, అత్తమామలతో ఎలా తీవ్ర వివాదానికి దారితీసిందో వీడియోలో పునీత్ విమరించారు. తనపై ఆర్థిక భారమైన డిమాండ్లు విధించారని, అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. ‘‘ నా అత్తమామలు, భార్య నన్ను తీవ్రంగా హింసిస్తున్నందు నేను ఆత్మహత్ చేసుకోబోతున్నాను. మేము ఇప్పటికే కొన్ని షరతులు పరస్పర విడాకుల కోసం దాఖలు చేసాము. సహజంగానే, పరస్పర విడాకుల విషయానికి వస్తే మేము కోర్టులో కొన్ని షరతులపై సంతకం చేసాము. మేము 180 రోజుల వ్యవధిలో ఆ షరతులను నెరవేర్చాలి, కానీ నా పరిధికి మించిన కొత్త షరతులతో నా అత్తమామలు, నా భార్య నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను భరించలేని విధంగా రూ. 10 లక్షలు అడుగుతున్నారు. నా తల్లిదండ్రులు ఇప్పటికే కొంత డబ్బు ఇచ్చారు, మళ్లీ వారిని అడగలేను’’ అని వీడియోలో చెప్పారు.
పునీత్ ఖురానా కుటుంబం మాట్లాడుతూ.. మానికా పహ్వాతో పాటు ఆమె సోదరి, తల్లిదండ్రులు వేధించారని, మాణికా పునీత్ ఇన్‌స్టాగ్రామ్‌ని హ్యక్ చేసిందని పునీల్ సోదరి చెప్పారు. తన కొడుకు మౌనంగా అన్ని బాధల్ని భరించారని, అతడికి న్యాయం జరగాలని పునీత్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. విడాకులు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుండగా, ఇద్దరి మధ్య బేకరీ, కేఫ్‌కి సంబంధించి వ్యాపార వివాదం కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 30న ఖురానా, మాణికా మధ్య 15 నిమిషాల ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మాణికా, పునీత్‌ని కించపరిచే విధంగా మాట్లాడినట్లు రికార్డైంది. ‘‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశాము. బిచ్చగాడివి, నువ్వేం అడిగావో చెప్పు, నాకు నీ మొహం చూడటం ఇష్టం లేదు. నా ఎదురుగా వస్తే చెంపపై కొడతా, విడాకులు తీసుకుంటే నన్ను వ్యాపారం నుంచి తొలగిస్తావా..? నువ్వు ఎస్ అని చెబితే, నువ్వు నన్ను బెదిరిస్తే, నేను ఆత్మహత్య చేసుకుంటా..’’ అంటూ మాణికా మాట్లాడింది. వీటిన్నింటికి సమాధానంగా పునీత్ ‘‘నీకేం కావాలి’’ అని అడిగాడు.
డిసెంబర్ 31న సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీ పోలీసులకు ఘటనపై సమచారం అందింది. పునీత్ ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఖురానా వీడియో స్టేట్‌మెంట్ మరియు కాల్ రికార్డింగ్‌లతో కూడిన మొబైల్ ఫోన్‌ను సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరికి 2016లో వివాహం జరిగింది. మొదట్లో ఇద్దరు వుడ్‌బాక్స్ కేఫ్ నిర్వహించారు. వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత వీరి సంబంధం దెబ్బతింది. ఈ ఘటనలో ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పోలీసులు కాల్ రికార్డింగ్‌లు, CCTV ఫుటేజీ, పునీత్ ఖురానా మొబైల్ ఫోన్‌ని తీసుకున్నారు.
Puneet Khurana's last video before suicide.#JusticeForPuneetKhurana pic.twitter.com/s5zDXrDDIC
— Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) January 2, 2025