Maharashtra: మహారాష్ట్రలో ఓ విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడని డిక్లేర్ చేయబడిన వ్యక్తి, సజీవంగా ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాలోని కసాబా బవాడ నివాసి అయిన 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకి గుండెపోటు వచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.
Read Also: Cafe Owner Suicide: ‘‘భార్య, అత్తమామలు తీవ్రంగా హింసించారు’’.. ఆత్మహత్యకు ముందు పునీత్ వీడియో..
ఇక చేసేందేం లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ని మాట్లాడారు. ఇంటి వద్ద కుటుంబీకులు, బంధువుల ఉల్పే అంత్యక్రియలకు అంతా సిద్ధం చేస్తున్నారు. అంబులెన్స్‌లో వెళ్తున్న క్రమంలో ఓ ‘‘స్పీడ్ బ్రేకర్’’ నుంచి వేగంగా వెళ్లింది. ఆ సమయంలో ఉల్పే వేళ్లలో కదలికల్ని అతడి భార్య గమనించింది. ఆ తర్వాత వెంటనే వేరే ఆస్పత్రికి తరలించారు. రెండు వారాలు అక్కడే ఉండీ, యాంజియోప్లాస్టీ చేయించుకుని మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాడు.
డిసెంబర్ 16 నాటి సంఘటలను ఉల్పే వివరించారు. ‘‘నేను నడిచి ఇంటికి వచ్చి టీ తాగా కూర్చున్నాను. నాకు కళ్లు తిరగడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో గుర్తులేదు’’ అని ఆయన చెప్పారు.