Israel: మొస్సాద్ – ఇజ్రాయిల్ గూఢచార సంస్థ. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పై ఏజెన్సీ. 1962లో సిరియాలో మొస్సాద్ ఏజెంట్ ఎలి కోహెన్ బహిరంగంగా ఉరితీయబడ్డాడు. వ్యాపారవేత్తగా కమెల్ అమిన్ థాబెట్ పేరుతో సిరియా రాజధాని డమాస్కస్‌లోకి అడుగుపెట్టి కోహెన్, అతి తక్కువ కాలంలోనే ఆ దేశంలోని ఎలైట్ వర్గంలో ప్రముఖ వ్యక్తిగా మారాడు. దేశంలోని శక్తివంతమైన రాజకీయ నాయకులు, మిలిటరీ లీడర్లతో సంబంధాలను పెంచుకున్నాడు. అయితే, చివరకు అతను మొస్సాద్‌కి చెందిన గూఢచారిగా తెలియడంతో ఆయనను మే18, 1965లో బహిరంగా ఉరితీశారు. మూడు సంవత్సరాల తరువాత, అతను సెంట్రల్ డమాస్కస్‌లోని మార్జే స్క్వేర్‌లో బహిరంగంగా ఉరితీయబడ్డాడు.
ఇదిలా ఉంటే కోహెన్ మృతదేహం కోసం గత కొన్ని దశాబ్ధాలుగా ఇజ్రాయిల్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సిరియాలో ఇటీవల బషర్ అల్ అస్సాద్ పాలనను తిరుగుబాటుదారులు గద్దె దించారు. దీంతో కోహెన్ మృతదేహాన్ని తిరిగిపొందేందుకు ఇజ్రాయిల్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 1967లో 6-డేస్ యుద్ధంలో ఇజ్రాయిల్ గెలిచేందుకు కోహెన్ ఇచ్చిన సమాచారమే అత్యంత కీలకం. అందుకే ఇజ్రాయిల్ అతడి మృతదేహ అవశేషాలను తిరిగిపొందాలనుకుంటోంది. దశాబ్ధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కోహెన్ ఖనన స్థలం వివరాలు తెలియరాలేదు. సిరియన్ అధికారులు ఎప్పటికప్పుడు మృతదేహాన్ని అనేక సార్లు మార్చినట్లు తెలుస్తోంది.
READ ALSO: Gujarat: ‘‘ఆమెకు గుణపాఠం చెప్పండి’’..భార్య వేధింపులతో మరో వ్యక్తి బలి..
కోహెన్ 1924లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఈజిప్షియన్ యూదుల కుటుంబంలో జన్మించాడు. 1948లో ఇజ్రాయిల్ స్థాపన తర్వాత, కోహెన్ తన కుటుంబంతో ఇజ్రాయిల్ దేశానికి వచ్చాడు. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన తర్వాత, కోహెన్‌ను 1960ల ప్రారంభంలో మొస్సాద్ నియమించింది. అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో నైపుణ్యం కలిగిన కోహెన్ గూఢచర్యంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
కోహెన్ తన గుర్తింపుని కమెల్ అమిన్ థాబెట్‌గా మార్చుకున్నాడు. అతడి కుటుంబం అర్జెంటీనాకు వెళ్లిన సిరియన్ వ్యాపారవేత్తగా మార్చాడు. కోహెన్ బ్యూనస్ ఎయిర్స్‌కి తన నివాసాన్ని మార్చడు. అక్కడే సిరియన్ కమ్యూనిటీలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 1962లో సిరియాకు వెళ్లి, అక్కడ ప్రభావవంతులైన వ్యక్తిగా చెలామణీ అయ్యాడు. తన పరిచయాలను ఉపయోగించి ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేశాడు. గోలన్ హైట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాడు. ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయిల్ గోలన్ హైట్స్‌ని ఆక్రమించింది.
కోహెన్ గూఢచర్య కార్యకలాపాలను 1965లో సిరియా గుర్తించింది. సోవియట్ యూనియన్ సహాయంతో సిరియన్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయిల్‌కి అతడి రహస్య రేడియో ప్రసారాలను గుర్తించింది. జనవరి 24, 1965న, సిరియన్ అధికారులు అతని ఇంటిపై దాడి చేశారు. క్షమాపణ కోసం అంతర్జాతీయ అభ్యర్ధనలు ఉన్నప్పటికీ, కోహెన్‌ను మే 18, 1965న బహిరంగంగా ఉరితీశారు. అతడిని ఉరితీసినప్పటికీ, మృతదేహం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అతడి మృతదేహాన్ని తెప్పించేందుకు, ఇజ్రాయిల్ ఖైదీనలు విడుదల చేస్తామని సిరియాకు ప్రతిపాదన పెట్టినా తిరస్కరించింది. 2018లో, మొస్సాద్ సిరియా నుండి కోహెన్ చేతి గడియారాన్ని విజయవంతంగా తిరిగి పొందింది.