Bird flu: మహారాష్ట్ర నాగ్‌పూర్ సమీపంలోని గోరెవాడ రెస్క్యూ సెంటర్‌లో మూడు పులులు, ఒక చిరుతపులి మరణించింది. బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ H5N1 వైరస్) సోకడంతో వన్యప్రాణులు మరణించాయి. డిసెంబర్ 2024 చివరలో ఈ మరణాలు నివేదించబడ్డాయి. దీంతో మహారాష్ట్ర అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మానవులు-వన్యప్రాణుల సంఘర్షణ సంఘటనల తర్వాత వీటిని డిసెంబర్‌లో చంద్రపూర్ నుంచి గోరెవాడకు తరలించారు.
Read Also: Ramesh Bidhuri: “నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు”.. బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు..
డిసెంబర్ 20న ఒక పులి చనిపోగా, డిసెంబర్ 23న మరో రెండు పులులు చనిపోయాయి. వీటి శాంపిళ్లను భోపాల్‌లోని ICAR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NISHAD)కి పంపారు. జనవరి 1న ల్యాబ్ ఫలితాలు వచ్చాయి. వీటిలో జంతువులకు H5N1 బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఈ కేంద్రంలోని 26 చిరుతలు, 12 పులులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా, ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అడవి జంతువులు బర్డ్ ఫ్లూ సోకని ఇతర జంతువుల మాంసాన్ని తినడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.