Zimbabwe: ఆఫ్రికా దేశం జింబాబ్వే కఠినమైన అడవులు, వన్యప్రాణులకు కేంద్రంగా ఉంది. ఇలాంటి అడవుల్లో ఎవరైనా తప్పిపోతే దాదాపుగా మరణమే శరణ్యం. అలాంటిది ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతంగా బయటపడిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తగా నిలిచింది. ఉత్తర జింబాబ్వేకి చెందిన బాలుడు కఠినమైన అడవి పరిస్థితులను ధిక్కరించి విజయం బయటపడపడ్డాడు. ఏనుగులు, సింహాలకు కేంద్రంగా ఉన్న మాటుసడోనా నేషనల్ పార్క్‌లో తప్పిపోయిన టినోటెండా పుండు 5 రోజుల తర్వాత సజీవంగా కనిపించాడు.
పుండు డిసెంబర్ 27న తన గ్రామం నుంచి దూరం వెళ్లాడు. మార్గం, దిశ తెలియక భయంకరమైన అడవిలోకి వెళ్లాడు. తన ఇంటి నుంచి దాదాపుగా 50 కి.మీ దూరంలో డిహైడ్రేషన్ స్థితిలో బలహీనమైన పరిస్థితుల్లో కనుగొనబడ్డాడు. బాలుడు ప్రాణాలతో సజీవంగా ఉండటానికి అతను నేర్చుకున్న నైపుణ్యాలు సాయపడ్డాయి. కరువు పీడత ప్రాంతంలో ఎలా బతకాలి అని నేర్చుకోవడం అతడికి ఉపయోగపడింది.
Read Also: Anantha Sriram: హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి..
బాలుడు నది ఒడ్డున కర్రలను ఉపయోగించి నీటి కోసం తవ్వాడు. అడవిలో దొరికే పండ్లను తిన్నాడు. స్థానిక ఎంపీ పీ. ముత్సా మురోంబెడ్జీ బాలుడు టినోటెండా అద్భుతమైన సాహసాన్ని వివరించారు. హాగ్వే నదికి సమీపంలో ఐదు సుదీర్ఘమైన బాధకరమై రోజులను గడిపాడని, బాలుడు గర్జించే సింహాలు, ఎనుగుల, చలిని భరిస్తూ మనుగడి సాగించారని ఆమె తెలిపాడు.
పార్క్ రేంజర్లు, న్యామిన్యామి కమ్యూనిటీ మరియు స్థానిక వాలంటీర్ల సంయుక్త కృషి లేకుండా టినోటెండా బతికే వాడు కాదు. మటుసడోనా ఆఫ్రికా పార్క్స్‌లోని రేంజర్లు బాలుడిని గుర్తించేందుకు కీలక పాత్ర పోషించారు. బాలుడుని తన ఇంటి వైపు నడిపించేలా చేయడానికి కమ్యూనిటీ ప్రజలు రాత్రిపూట డ్రమింగ్ వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించారు.
💫 A boy missing & found in Matusadonha game park
A true miracle in remote Kasvisva community, Nyaminyami in rural Kariba, a community where one wrong turn could easily lead into a game park. 8-year-old Tinotenda Pudu wandered away, lost direction & unknowingly headed into the… pic.twitter.com/z19BLffTZW
— Mutsa Murombedzi MP🇿🇼 (@mutsamu) January 1, 2025