Emergency: కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘‘అత్యవసర పరిస్థితి’’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా, ఇందిరా గాంధీ పాత్రని పోషించింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని బంగ్లాదేశ్ నిషేధించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ఎమర్జెన్సీని బంగ్లా నిషేధించింది.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు బలవంతంగా పనిచేయాల్సి వస్తోంది. యుద్ధంలో రష్యా తరుపున పోరాడుతూ ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై భారత్ తన అభ్యంతరాన్ని ఇప్పటికే రష్యాకు చెప్పింది. భారతీయుల్ని యుద్ధ క్షేత్రం నుంచి పంపించాలని సూచించింది. ఇదిలా ఉంటే, తాజాగా కేరళ త్రిస్సూర్ లోని కురంచేరికి చెందిన 32 ఏళ్ల జైన్ కురియన్ వీడియో వెలుగులోకి వచ్చింది.
Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపుల నుంచి ప్రాణాపాయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. అయితే, దీనిపై కేజ్రీవాల్ కీలక కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘‘దేవుడే నన్ను రక్షిస్తాడు’’ అని అన్నారు. దేవుడు అనుమతించిన కాలం తాను జీవించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
Meta: ఐటీ ఉద్యోగులకు మెడపై కత్తి వేలాడుతోంది. గత రెండేళ్లుగా అగ్రశ్రేణి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘‘లే ఆఫ్’’ ఇస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాబోయే కాలంలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
Farmer: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్‌గఢ్‌లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
Pakistan: అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన 9/11 ఉగ్రదాడిని తలపించేలా, ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) చేసిన సోషల్ మీడియా పోస్ట్ నవ్వులపాలైంది. పాకిస్తాన్ పరువు తీసింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని విమానాలు ఢీకొన్న తరహాలోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని ఢీకొనేందుకు వెళ్తున్నట్లుగా పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్‌ని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌ని ఏకిపారేశారు.
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
BJP On Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్తో మాత్రమే కాకుండా దేశంతో కూడా పోరాడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది.
Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని […]