Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది. ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2 […]
Law student suicide: నోయిడాలో శనివారం లా విద్యార్థి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలో విద్యార్థి మాజీ ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.
Puri Shankaracharya: ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని అడ్డుకోలేకపోతోంది.
Gaza Truce Deal: ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న ‘‘గాజా యుద్ధానికి’’ బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో ఇరు వర్గాల మధ్య యుద్ధవిరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొలి విడతలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయిలీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Pakistan: యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్‌ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.
Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
Ram Mandir: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరి ఏడాది గడిచింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.