Ukraine War: ‘‘మాకు సాయం చేయండి’’.. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న కేరళ వాసి..
- ఉక్రెయిన్ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులు..
- కేరళ వ్యక్తి భావోద్వేగ వీడియో వైరల్..
- రక్షించాలని సాయం కోరిన జైన్ కురియన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు బలవంతంగా పనిచేయాల్సి వస్తోంది. యుద్ధంలో రష్యా తరుపున పోరాడుతూ ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై భారత్ తన అభ్యంతరాన్ని ఇప్పటికే రష్యాకు చెప్పింది. భారతీయుల్ని యుద్ధ క్షేత్రం నుంచి పంపించాలని సూచించింది. ఇదిలా ఉంటే, తాజాగా కేరళ త్రిస్సూర్ లోని కురంచేరికి చెందిన 32 ఏళ్ల జైన్ కురియన్ వీడియో వెలుగులోకి వచ్చింది.
తాను రష్యాలో ఎదుర్కొంటున్న బాధల్ని వీడియోలో వెల్లడించారు. కురియన్ మొదట్లో రష్యాకు క్యాంటీన్‌లో పనిచేయడానికి వెళ్లారు. ఆ తర్వాత రష్యన్ కిరాయి సైనిక బృందంలో చేర్చుకున్నట్లు వీడియోలో ఆయన పేర్కొన్నారు. కట్టనెల్లూర్ ప్రాంతానికి చెందిన బినిల్ బాబుతో కలిసి జైన్ కురియన్ ఒక ఏజెంట్ సాయంతో రష్యాకు వెళ్లాడు. వారు క్యాంటీన్‌లో పనిచేయడానికి వెళ్లారు. యుద్ధ ప్రాంతంలో పట్టుబడి, రష్యా తరుపున పోరాటం చేస్తు్న్నారు. వీరిద్దరు ఫ్రంట్ లైన్ దళాలకు నీరు, ఆహారం తీసుకువెళ్తున్న సమయంలో బలవంతంగా రష్యన్ బలగాల్లో చేరాల్సి వచ్చింది. జైన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాడు, కానీ నెలల క్రితమే అతడి ఒప్పందం రద్దు చేయబడిందని చెప్పారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
Read Also: Manchu Manoj: మొన్న పంది పి**డా.. ఇప్పుడు ఎలుగు బంటి.. ఏందయ్యా మనోజ్?
‘‘ మేము రాయబార కార్యాలయంలో రామ్ కుమార్ సర్‌ని సంప్రదించాం. మూడు నెలల క్రితమే మా ఒప్పందం రద్దు చేయబడిందని సార్ మాకు చెప్పారు. కానీ మేము ఇక్కడ ఉన్న మా కమాండర్‌కి దాని గురించి తెలియజేసినప్పటికీ, మా ఒప్పందం ఇంకా రద్దు కాలేదని చెప్పారు. మా తొలగింపు గురించి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డర్ రావాలని ఆయన అన్నారు. మాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి ఏదో విధంగా మాకు సాయం చేయండి’’ అంటూ జైన్ భావోద్వేగంతో వీడియోలో చెప్పారు.
జైన్ మాస్కోలని ఒక ఆస్పత్రికి తరలించబడ్డాడు. ఆ సమయంలో అతను మూడు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేసి, దాడిలో తాను గాయపడినట్లు చెప్పారు. బినల్ బాబు కాల్పులకు గురైన తర్వాత యుద్ధ భూమిలోనే మరణించాడు. అతడి మరణ వార్తను భారత రాయబార కార్యాలయం కుటుంబానికి తెలియజేసింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?