Bangladesh: బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్.. ముందు అమెరికా, ఇప్పుడు స్విట్జర్లాండ్..
- బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్..
- ఆర్థిక సాయాన్ని నిలిపేసిన స్విట్జర్లాండ్..
- ఇప్పటికే సాయాన్ని నిలిపిన యూఎస్ఏ..
- దివాళాకు దగ్గర్లో మహ్మద్ యూనస్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది. యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బంగ్లాలో దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి, మరోవైపు విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి.
Read Also: Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్‌నర్” అరెస్ట్..
Also Read
- Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ఇదిలా ఉంటే, ఇటీవల ట్రంప్ బంగ్లాదేశ్‌కి షాకిస్తూ.. ఎలాంటి ఆర్థిక సాయాన్ని అందించబోమని ప్రకటించారు. ఈ దెబ్బతో బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా తయారుకాబోతోంది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID), బంగ్లాదేశ్‌కు తన నిధులను నిలిపివేయాలని నిర్ణయించుకున్న కొన్ని రోజుల తర్వాత, తాజాగా స్విట్జర్లాండ్ కూడా అమెరికా బాటలోనే ప్రయణిస్తోంది. స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ కోఆపరేషన్ (SDC) 2028 చివరి నాటికి బంగ్లాదేశ్‌లో తన ద్వైపాక్షిక అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తుంది. ఈ నిర్ణయం అల్బేనియా, జాంబియా అనే మరో రెండు దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది.
swissinfo.ch నివేదిక ప్రకారం.. డిసెంబర్‌లో స్విస్ పార్లమెంట్ ప్రభుత్వం కోరిన దాని కంటే తక్కువ నిధులను విదేశీ సాయానికి కేటాయించిన తర్వాత, తాజా నిర్ణయం వచ్చింది. నివేదిక ప్రకారం.. పార్లమెంట్ 2025 అంతర్జాతీయ సహకార బడ్జెట్ నుంచి 121 మిలియన్ డాలర్లను తగ్గించింది. 2026-28 వరకు ఆర్థిక ప్రణాళికలో కోత విధించింది. దీంతో రానున్న రోజుల్లో బంగ్లాదేశ్‌కి మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తబోతున్నాయి.
తాజావార్తలు
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!