S Jaishankar: డొనాల్డ్ ట్రంప్ ‘‘అమెరికన్ జాతీయవాది’’..
- ట్రంప్ అమెరికన్ జాతీయవాది..
- కీలక వ్యాఖ్యలు చేసిన జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ని ‘‘అమెరికన్ జాతీయవాది’’గా జైశంకర్ అభివర్ణించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో గురువారం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ… ప్రపంచ దౌత్య స్వభావం, భారతదేశం విధానాన్ని గురించి చెప్పారు.
‘‘నేను ఇటీవల ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యాను. మాకు మంచి ఆదరణ లభించింది. ఆయన అమెరికన్ జాతీయవాది అని నేను నమ్ముతాను’’ అని ట్రంప్ భారత్‌కి మిత్రుడా, శతృవా అనే ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాలు ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని ఆయన అంగీకరించారు. కానీ భారతదేశ విదేశాంగ విధానం జాతీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. ‘‘ట్రంప్ చాలా విషయాలను మారుస్తారు, బహుశా కొన్ని మన సిలబస్‌కి దూరంగా ఉండొచ్చు, కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా మన విదేశాంగ విధానాన్ని నిర్వహించాలి’’ అని చెప్పారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
Read Also: Vizag: శెభాష్.. 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన విశాఖ సిటీ పోలీస్
అమెరికాతో భారత్‌కి బలమైన సంబంధం ఉందని, ప్రధాని మోడీకి ట్రంప్‌తో వ్యక్తిగత స్నేహం ఉందని జైశంకర్ అన్నారు. ‘‘ఇప్పుడు భారతీయులు కాని వారు కూడా తాము భారతీయులమని చెబుతారు. అది వారికి ఎక్కడో ఒక విమానంలో సీటు పొందడానికి సాయపడుతుందని భావిస్తున్నారు’’ అని పెరుగుతున్న భారతదేశ ప్రాధాన్యతను వివరించారు.
తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. విద్యారంగం, దౌత్యం, రాజకీయాల్లోకి వచ్చిన విషయాలను ప్రస్తావించారు. ‘‘నేను బ్యూరోక్రాట్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయాల్లోకి నా ఎంట్రీ కూడా అనుకోకుండా జరిగింది. దీనిని అదృష్టంగా పిలుస్తారు లేదా దానిని మోడీ అని పిలుస్తారు. ఎవరూ నో చెప్పని విధంగా ప్రధాని మోడీ తనను మంత్రిని చేశారు’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!