Maha Kumbh Mela: ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలి.. ఆమె ఐడియాతో “కుంభమేళా”లో డబ్బులు సంపాదిస్తున్న యువకుడు..
- గర్ల్‌ఫ్రెండ్ ఐడియాతో వేలు సంపాదిస్తున్న యువకుడు..
- మహా కుంభమేళాని ఆదాయంగా మార్చుకున్నాడు..
- వేపపుల్లలు అమ్ముతున్న యువకుడు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela: ‘‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్ల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ‘‘వేప పుల్లలు’’ అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. భక్తులు తమ దంతాలను శుభ్రపరుచుకోవడానికి సదరు యువకుడి వద్ద నుంచి పుల్లలను కొనుగోలు చేస్తున్నారు. వారం వ్యవధిలోనే తాను రూ. 40,000 సంపాదించినట్లు చెప్పాడు.
Read Also: Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఈ ఆలోచన తన ‘‘గర్ల్‌ఫ్రెండ్’’ ఇచ్చిందని నవ్వుతూ సమాధానం చెబుతున్నాడు. తాను డబ్బు సంపాదించేందుకు కుంభమేళాకి వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం ఇతడి వ్యాపారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఇప్పటి వరకు రూ. 40,000 సంపాదించానని చెప్పారు. పెట్టుబడి అవసరం లేని వ్యాపారంలో వేపపుల్లల్ని అమ్మాలని తన స్నేహితురాలు చెప్పిందని, ఆమె కారణంగా చాలా సంపాదించానని చెప్పారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు యువకుడి నిజాయతీ, అతడి ప్రేమను అభినందిస్తున్నారు. ఇంతమంచి అమ్మాయిని వదులుకోవద్దని, ఆమెను మోసం చేయవద్దని చాలా మంది నెటిజన్లు సూచించారు. ప్రతీ విజయం వెనక, ఒక స్త్రీ ఉంటుందని, తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడం బాగుందని అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవసమాగమంగా ‘‘కుంభమేళ’’ ప్రసిద్ధి చెందింది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుంది. మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..