Congo fever: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF)తో మరణించాడు. సాధారణంగా దీనిని ‘‘కాంగో జ్వరం’’గా పిలుస్తుంటారు.
Bangladesh: నానాటికి బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాదం, ఉగ్రవాద భావాలు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి మహ్మద్ యూనస్ ప్రభుత్వం, పాకిస్తాన్‌తో చెలిమి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి సైనిక సాయాన్ని కోరుతోంది.
Canada: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమెరికాలో అక్రమంగా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వారిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బహిష్కరిస్తోంది. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ‘‘మరణం తర్వాత ఏం జరుగుతుంది..?’’ అని ఆన్లైన్లో సెర్చ్ చేసిందిన పోలీసులు మంగళవారం తెలిపారు.
Sam Pitroda: ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని’’ భారత్‌లోకి రానివ్వాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ మండిపడుతోంది. గతంలో కూడా సామ్ పిట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టాయి. లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయులపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్‌లను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను ‘‘అత్యంత సుంకాల తయారీదారులు’’గా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, ఆమెరికాని మొదటిస్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై అలా జరగనవ్వబోము అని ప్రకటించారు.
ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతల రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ ఫిబ్రవరిలో తనతో వైట్హౌజులో సమావేశమయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
Donald Trump: డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు మన దేశం అంగీకరించింది. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘సరైనది చేస్తారు’’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ సోమవారం ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి, ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది.