Live-in relationship: ఇటీవల కాలంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. రెండేళ్ల క్రితం ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేయడంతో ఈ తరహా నేరాలు వెలుగులోకి వచ్చాయి. దీని తర్వాత కూడా లివ్‌ఇన్‌లో ఉంటున్న పలువురు మహిళల్ని వారి భాగస్వాములు చంపేశారు. కొన్ని సందర్భాల్లో లివ్ రిలేషన్స్ చెడిపోవడం వల్ల మగవాళ్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Read Also: France : ఫ్రాన్స్‌లోని వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు
ఇదిలా ఉంటే, తనతో సంబంధాన్ని తెంచుకుందని 30 ఏళ్ల వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. నందన్వన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన తర్వాత, బాధితుడు సాగర్ మిశ్రాని ఆస్పత్రిలో చేర్చారు. మిశ్రా తాగుడుకు బానిస కావడంతో 27 ఏళ్ల యువతి అతడితో సంబంధాన్ని తెంచుకుంది.
“శనివారం ఉదయం, మిశ్రా ఆమె ఇంటికి వెళ్లి ఆమెను తిరిగి రమ్మని ఒప్పించడానికి ప్రయత్నించాడు, దానికి ఆమె నిరాకరించింది. ఆమె తల్లి కూడా ప్రతిఘటించడంతో, అతను ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత, అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు” అని పోలీస్ అధికారి వెల్లడించారు. అతడిని పోలీసులు విచారణకు పిలిచిన సందర్భంతో తనతో తెచ్చుకున్న విషాన్ని తాగాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.