Chinese ship: అరేబియా సముద్రంలోకి చైనా నౌకలు.. భారత్‌కి అలర్ట్..
- అరేబియా సముద్రంలో చైనా నౌకలు..
- ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతున్న చైనా..
- నౌకల్ని అనుమతించిన మాల్దీవులు..
- భారత్‌కి ఆందోళన కలిగించే పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese ship: భారత్‌కి చైనా నుంచి భద్రతపరమైన సమస్యలు తప్పడం లేదు. తాజాగా చైనాకు చెందిన నౌకలు, ఇండియాకు సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలమైన సముద్రం నిఘాను సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, చైనా మాత్రం ‘‘మత్స్య పరిశోధన’’ కోసమని చెబుతోంది. రెండు నౌకలు లాన్ హై 101 , 201 అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్( OSINT) నిపుణుడు డామియన్ సైమన్ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ నౌకల గమనాన్ని పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. తాజాగా చైనా నౌకల్ని మాల్దీవులు అనుమతించడం భారత్‌ని ఆందోళనపరుస్తోంది. ఈ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లు, రిమోట్ ఆపరేటేడ్ వెహికల్స్ (ROVలు) ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది సముద్రగర్భాన్ని మ్యాప్ చేయడంతో పాటు కీలక సైనిక సమాచారాన్ని సంపాదించగలదు.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
Read Also: PM Modi: నెహ్రూ గురించి తెలియాలంటే “జాన్ ఎఫ్ కెన్నడీ పుస్తకం చదవండి”..
ఈ నౌకలు పరిశోధన ముసుగులో వ్యూహాత్మక డేటాతో పాటు సముద్ర గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చైనా కార్యక్రమాలు ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు కరాచీలో పాకిస్తాన్ నావికాదళం నిర్వహించే మల్టీ నేషనల్ నేవల్ ఎక్సర్‌సైజ్ సమయంలో కనిపించాయి. ఈ విన్యాసాలలో చైనా ఆర్మీ పాల్గొనే అవకాశం ఉంది. ఈ పరిణామాలు హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ సైనిక సహకారాన్ని మరింత పెంచుతుందనే ఆందోళన నెలకొంది.
గతంలో శ్రీలంక చైనా నౌకల్ని అనుమతించడం కూడా వివాదాస్పదమైంది. హంబన్‌టోట తీరానికి చైనా నౌకలు రావడంపై భారత్ తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది. గత కొంత కాలంగా చైనా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత ఆధిపత్యాన్ని అధిగమించాలని అనుకుంటోంది. దక్షిణాసియా అంతటా తన వాణిజ్య, సైనిక ఆస్తుల్ని కూడబెడుతోంది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!