Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, పదవుల్లో ఉండొచ్చా?.. సుప్రీం కీలక ఆదేశాలు..
- దోషులుగా తేలిన రాజకీయ నాయకులు పదవుల్లో ఉండొచ్చా..?
- కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలను జీవితాంతం అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 6 సంవత్సరాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’’లోని నిబంధనలను పిటిషనర్ సవాల్ చేశారు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ తన రిపోర్టుని అందజేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన దేశవ్యాప్తంగా 5000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
2017లో వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల కోసం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ప్రజా ప్రతినిధుల కేసులను త్వరగా పరిష్కరించడాన్ని పర్యవేక్షించడానికి అనేక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది, అయినప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని కోర్టుకు మిత్రుడిగా వ్యవహరించే అమికస్ క్యూరీ వెల్లడించారు. 42% సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటని, 30 సంవత్సరాలుగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక కోర్టులు తరచుగా ప్రజాప్రతినిధుల వ్యవహారాలు కాకుండా ఇతర కేసులను విచారించాల్సి వస్తుందని చెప్పారు. దీంతో కేసులు వాయిదా పడుతున్నాయని, పలు సందర్భాల్లో నిందితులు హాజరుకావడం లేదని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!