Anna Hazare: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోరంగా ఓడిపోయింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి స్వయంగా ఓడిపోయారు. ఈయనే కాకుండా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా ఓటమి చవిచూశారు. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 48 చోట్ల బీజేపీ గెలుపొందగా, […]
Mangalyaan-2: ‘‘మంగళయాన్’’ ఇస్రో చరిత్రలో ఘన విజయంగా చెప్పొచ్చు. దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగంగా భారతీయ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది. హాలీవుడ్ సినిమా ‘‘గ్రావిటీ’’ బడ్జెట్ కన్నా అతి తక్కువ బడ్జెట్‌తో మనం అంగారక గ్రహాన్ని చేరడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి.
Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు.
Wardha gang rape case: 2010లో సంచలనం సృష్టించిన ‘‘వార్ధా సామూహిక అత్యాచారం’’ కేసులో సంచలనం నమోదైంది. ఈ అత్యాచార కేసులో దోషులుగా తేలి, 10 ఏళ్లుగా జైలు శిక్ష విధించబడిన 8 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు, ఫిర్యాదుదారుడి వాంగ్మూలంలో అసమానతలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది. కేసు నేపథ్యం ఇదే: జూన్ 24, 2010న తనకు ఆరోగ్యం బాగాలేదని, దీంతో ఆస్పత్రికి వెళ్లినట్లు బాధితురాలు […]
Corona Virus: కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ మాదిరిగానే జంతువుల నుంచి మానవుడికి వ్యాపించే ప్రమాదం కలిగి ఉన్న కొత్త వైరస్ చైనా పరిశోధకులు గుర్తించారు. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన కారణంగా ‘‘బ్యాట్ ఉమెన్’’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ, గ్వాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్స్, వూహాన్ యూనివర్సిటీ అండ్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు
Chhaava: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘‘ఛావా’’ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్లో శంభాజీ క్యారెక్టర్లో జీవించారు.
PM Modi: ‘‘హిందీ’’ వివాదంపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, రూలింగ్ పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ‘‘భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి’ అని సూచించారు.
Manipur: ఏడాదిన్నర కాలంగా మైయిటీ, కుకీల మధ్య జాతుల ఘర్షణలో అట్టుడికుతున్న మణిపూర్‌లో గత వారం రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సీఎం పదవిని ఎవరూ తీసుకోకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. అయితే, రాష్ట్రపతి పాలన విధించిన తొలి వారంలోనే భద్రతా బలగాలు అక్కడి ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపులపై భారీ అణిచివేత కార్యక్రమాలు చేపట్టారు.
Asteroid 2024 YR4: 2024 YR4 అనే గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. దీని వల్ల భూమికి రిస్క్ ఉంటుందని ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళనచెందుతున్నారు. ‘‘సిటీ కిల్లర్’’గా పిలుస్తున్న ఈ ఆస్టారాయిడ్ 2032లో భూమిని ఢీకునే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. ఈ అంతరిక్ష వస్తువు 130-300 అడుగుల వెడల్పు ఉంటుందని, ఇది జనసాంద్రత కలిగిన ప్రాంతాలను తాకితే భారీ విపత్తు తప్పకపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని గమనాన్ని నిశితంగా గమనిస్తున్నారు.
Bride Flees With Boyfriend: మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోడాలో వధువు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోవడం వార్తల్లో నిలిచింది. రిసెప్షన్‌కి ముందే ప్రియుడితో లేచిపోయింది. రిసెప్షన్ కోసం సిద్ధం కావడానికి బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన వధవు, తిరిగి వస్తుండగా కొంత మందితో కలిసి కారులో పారిపోయింది. ముందుగా, తన భార్యను కిడ్నాప్ చేశారని భర్త ఆరోపించాడు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. విచారణలో అసలు నిజం తెలిసి అంతా షాకయ్యారు.