India On USAID: భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనే ఉద్ధేశ్యంతో, 21 మిలియన్ డాలర్లను గత అమెరికా ప్రభుత్వం కేటాయించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’, రాహుల్ గాంధీలు ఈ నిధుల్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Mumbai Court: గుర్తు తెలియని మహిళకు రాత్రిపూట ‘‘ నువ్వు స్లిమ్‌గా ఉన్నావు, చాలా స్మార్ట్‌గా అందంగా ఉన్నాము, నువ్వుంటే నాకు ఇష్టం’’ అంటూ మెసేజ్ చేయడం అసభ్యకరమని ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. మాజీ కార్పొరేటర్‌కి వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు పంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి) డిజి ధోబ్లే ఈ వ్యాఖ్యలు చేశారు.
Sambhal violence: గతేడాది నవంబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ పట్టణలో అల్లర్లు చెలరేగాయి. ఈ అలర్లకు కేరాఫ్‌గా ‘‘షాహీ జామా మసీదు’’ మారింది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనాలను దెబ్బకొట్టాడు.
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్‌కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు,
Elon Musk's gift to PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీకి ముందు, ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో ప్రధాని భేటీ అయ్యారు.
Teacher: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినిని తన ‘‘గర్ల్‌ఫ్రెండ్’’గా ఉండాలని కోరాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. తన గురుదక్షిణ కింద గర్ల్ ఫ్రెండ్‌గా మారమని కోరడం పెద్ద వివాదానికి దారి తీసింది. బాలిక పాఠశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. పాఠశాల అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు సదరు ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరేళ్లు గడిచాయి. 2019, ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన కారు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది.