Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచాయి. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు. అయితే, యుద్ధంలో రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ మాత్రం సర్వనాశనం అయింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచిన సందర్భంగా రష్యా, ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.
Israel Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య బందీల మార్పిడి జరుగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయిలీలను విడిచిపెడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ బందీల ఒప్పందంలో భాగంగా హమాస్ శనివారం మరో ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. బందీల్లో ఒకరైన ఒమర్ షెమ్ టోవ్, హమాస్ ఉగ్రవాది నుదుటిపై ముద్దు పెట్టడం సంచలనంగా మారింది. Read Also: Linguswamy […]
Man Kills wife: భార్యని నమ్మించి కుంభమేళకు తీసుకెళ్లిన భర్త, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని దాచేందుకు పెద్ద కట్టుకథని అల్లాడు. చివరకు యూపీ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన ఒక జంట కుంభమేళ కోసం యూపీ ప్రయాగ్‌రాజ్‌కి వచ్చారు. అక్కడే ఒక హోమ్ స్టేలో బస చేశారు.
PM Modi: మహాకుంభమేళాని ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ ఆదివారం ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలను అపహాస్యం చేసే రాజకీయ నాయకులను, భారతదేశ మత వారసత్వాన్ని దెబ్బతీసే ‘‘ బానిస మనస్తత్వం’’ కలిగిన వ్యక్తులుగా మోడీ అభివర్ణిస్తూ విమర్శించారు.
Crime: మహారాష్ట్రలోని భివాండీలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆమెపై అఘాయిత్యం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 20వ తేదీ తెల్లవారుజామున ఒక పాఠశాలలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారు. మహిళపై ఆమె మాజీ ప్రియుడు అపహరించి, అతడి నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు.
Atishi: మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషిని ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండబోతోంది. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అతిషిని తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేఖా గుప్తాని బలంగా ఎదుర్కొనేందుకు మరో మహిళా నేత అతిషిని ఆప్ రంగంలోకి దించింది. Read Also: Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ […]
Bangladesh: 1971లో విడిపోయిన తర్వాత తొలిసారి బంగ్లాదేశ్, పాకిస్తాన్ తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పున:ప్రారంభించాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత మొదటి కార్గో పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల పాకిస్తానీ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది.
Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించింది.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ‘‘శతాబ్ధంలోనే అరుదైన సంఘటన’ ’గా అభివర్ణించారు. ఆగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి పాల్గొన్నారు.
Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు.