Mangalyaan-2: ‘‘మంగళయాన్’’ ఇస్రో చరిత్రలో ఘన విజయంగా చెప్పొచ్చు. దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగంగా భారతీయ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది. హాలీవుడ్ సినిమా ‘‘గ్రావిటీ’’ బడ్జెట్ కన్నా అతి తక్కువ బడ్జెట్‌తో మనం అంగారక గ్రహాన్ని చేరడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి. మార్స్ ఆర్బిటర్ మిషిన్(MOM) 2014లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే తొలి ప్రయత్నంలో మార్స్‌ని చేరిన దేశంగా ఇండియా ఘటన సాధించింది.
Read Also: Pakistan : నేడు 22 మంది భారతీయులను విడుదల చేయనున్న పాకిస్తాన్
అయితే, ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ‘‘ మంగళయాన్-2’’ ప్రయోగానికి సిద్ధమైంది. అంగారకుడిపై అంతరిక్ష నౌకని దింపడానికి ఈ ప్రయోగం ఉద్దేశించబడింది. ఇది సాధిస్తే, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. మంగళయాన్-2 అని పిలిచే మార్స్ ల్యాండర్ మిషన్(MLM)ను అంతరిక్ష కమిషన్ ఆమోదించింది. అయితే, ప్రస్తుతం దీనిని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రమంత్రి వర్గం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది.
మంగళయాన్ మిషన్‌కి కొనసాగింపుగా ఇప్పుడు మంగళయాన్-2న ఇస్రో ప్లాన్ చేసింది. ఇదే కాకుండా 2035 నాటికి భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి మొదటి భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలనే ప్రణాళికల్ని కలిగి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాల కోసం ఇస్రో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV) ను అభివృద్ధి చేస్తోంది.