MK Stalin: తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ విద్యా విధానంలో(ఎన్ఈపీ) భాగంగా తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కసరత్తు జరుగనుండటంతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BJP: కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ వ్యవహారం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన కేరళలోని అధికార లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం, ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీని పొగడటంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది.
Marriage: తప్పతాగిన వరుడు, వధువు మెడలో దండ వేయడానికి బదులుగా తన స్నేహితుడి మెడలో దండ వేయడంతో పెళ్లి క్యాన్సల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. మద్యం తాగి ఉన్న వరుడిని చూసిన వధువు, అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత పెళ్లి ఊరేగింపును కూడా వధువు వెనక్కి పంపింది.
Yogi Adityanath: మహా కుంభమేళా ముగింపుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. తాజాగా, మహా కుంభమేళాపై విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా అనేది ప్రజలు కోరికలు కోరుకునే ఒక నిధి అని ఆయన అన్నారు. ‘‘రాబందులకు శవాలు వచ్చాయి, పందులకు మురికి లభించింది. అయితే మంచి వ్యక్తులకు సంబంధాల అందమైన చిత్రం లభించింది. వ్యాపారులకు వ్యాపారం లభించింది. భక్తులకు శుభ్రమైన ఏర్పాటు లభించాయి’’ అని యోగి అన్నారు.
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్‌కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ని కొట్టలేకపోతోంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం. Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య […]
Belagavi: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య మరోసారి ‘‘భాష’’, ‘‘సరిహద్దు’’ వివాదం రాజుకుంది. ఇటీవల కర్ణాటక సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ మాట్లాడలేదని కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు దాడి చేశారు.
Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మతఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పెద్దపెద్ద సవాళ్లు చేస్తోంది. ఏ దశలోనూ భారత్‌తో పోలిక లేదు, అయినా భారత్‌ని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. తినడానికి తిండి లేకపోయినా, కింద కోట్ల అప్పులు ఉన్నా కూడా వాస్తవాలను మరిచి ప్రవర్తించడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అద్భుతంగా నిర్వహించింది. జనవరి 13 న ప్రారంభమైన ఈ అద్భుత కార్యక్రమం శివరాత్రి రోజు ఫిబ్రవరి 26తో ముగుస్తోంది. ఇప్పటివరకు దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి వచ్చిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటినట్లు సీఎం యోగి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా టెంపుల్ టూరిజం పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి, మథురలకు పెద్ద […]
Bengaluru: తాను ప్రేమించిన అమ్మాయి దూరమైందనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సదరు అమ్మాయి తండ్రి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూర్‌లో జరిగింది. మొత్తం మూడు కార్లను తగులబెట్టడంతో పాటు ఒక బైక్‌ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మూడు కార్లలో రెండు అమ్మాయి తల్లిదండ్రులవి కాగా, బైక్ ఆమె సోదరుడిది. నిందితుడు లక్ష్యంగా చేసుకున్న రెండు కార్ల పక్కన మరో కారు ఉండటంతో అది కూడా తగలబడింది. ఈ మొత్తం ఘటన అక్కడే ఉన్న…