Kolkata: గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేద్దామనుకున్న ఇద్దరు లేడీస్ అనూహ్య రీతిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటన కోల్‌కతాలో మంగళవారం జరిగింది. సూట్‌కేస్‌లో శవాన్ని తీసుకువచ్చిన ఇద్దరు మహిళలు, నగరంలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్‌లో పారేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, రోజూ వారీ యోగా సెషన్‌కి వచ్చే వారు వీరిని పట్టుకున్నారు. సూట్‌కేస్‌లో మృతదేహాన్ని చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.
Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.
Mother: బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. భర్తతో గొడవ పడిన కోపంలో కన్న బిడ్డల్ని కడతేర్చింది. ముగ్గురు పిల్లల్ని చంపినందుకు పోలీసులు మహిళను సోమవారం అరెస్ట్ చేశారు. 36 ఏళ్ల సీమా దేవి తన భర్త చందన్ మహత్తతో గొడవ పడింది. ఈ గొడవ జరిగిన తర్వాత పిల్లల్ని తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత బావిలో పడేసింది.
Odisha: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాల హాస్టల్లో 10 వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బోర్డు పరీక్షలు రాసిన తర్వాత, హాస్టల్‌కి తిరిగి వచ్చిన బాలిక సోమవారం ఆడ శిశువుకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు.
US Reciprocal Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ‘‘సుంకాల’’తో ప్రపంచదేశాలను భయపెడుతున్నాడు. ‘‘పరస్పర సుంకాలు’’ తప్పకుండా ఉంటాయని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధించారు. మరోవైపు సుంకాలు విధింపులో భారత్ అగ్రస్థానంలో ఉందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ తన అక్కసును వెళ్ళగక్కారు.
Hyperloop: ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌కి ఇండియా సిద్ధమవుతోంది. ఈ మేరకు భారతదేశంలో మొట్టమొదటి ‘‘హైపర్‌లూమ్’’ టెస్ట్ ట్రాక్‌ని మరింత డెవలప్ చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్‌కు, ఇండియన్ రైల్వేస్ అదనంగా 1 మిలియన్ డాలర్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ సోమవారం ప్రకటించారు.
Shashi Tharoor: కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వ్యవహారం ఆ పార్టీలో కాకరేపుతోంది. రేపోమాపో ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీకి థరూర్ సిగ్నల్స్ పంపుతున్నారు. తాజాగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ దిగడం కాంగ్రెస్‌కి స్పష్టమైన మెసేజ్‌ని పంపింది.
Solar Manufacturing: సోలార్ పవర్లో ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సోలార్ పవర్‌ని ప్రోత్సహిస్తోంది. ఇదెలా ఉంటే, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ ఇంధన పరివర్తన నుంచి ప్రయోజనం ప్లాన్‌లో భాగంగా భారత్ తన సౌర తయారీ పరిశ్రమను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల మూలధన సబ్సిడీ ప్రణాళికను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలిసిన వ్యక్తులు తెలిపారు.
UN on Ukraine: అమెరికా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రతీ దశలో కూడా ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలిచింది, అందుకు తగ్గట్లుగానే ఓటింగ్‌లో పాల్గొంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు చిరకాల ప్రత్యర్థిగా భావించే రష్యాతో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు.
Donald Trump: అమెరికా, ఉక్రెయిన్‌లోని ‘‘అరుదైన లోహాల’’పై కన్నేసింది. ఉక్రెయిన్ సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో అమెరికాకు వాటా మంజూరు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్ స్కీ ఈ ప్రతిపాదనపై సంతకం చేయడానికి ఈ వారం లేదా వచ్చే వారు వైట్ హౌజ్‌కి రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాలకు కేంద్రంగా మారింది. సోమవారం వైట్‌హౌజ్‌లో […]