CPM: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సీపీఎం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన నోట్‌లో.. బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనను ‘‘నయా-ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే హిందుత్వ కార్పొరేట్ నిరంకుశ వ్యవస్థ’’గా అభివర్ణించారు. కానీ దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన ఫాసిస్ట్ ప్రభుత్వం అని పిలవమని పేర్కొంది.
Read Also: Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..
“మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ లేదా నియో- ఫాసిస్ట్ ప్రభుత్వం అని మేము చెప్పడం లేదు. భారత రాజ్యాన్ని మనం నియో ఫాసిస్ట్ రాజ్యంగా కూడా వర్ణించడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగం అయిన బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని, ఫలితంగా ‘నియో-ఫాసిస్ట్ లక్షణాలు’ మాత్రమే వ్యక్తమయ్యాయని మేము స్పష్టంగా చెబుతున్నాము.’’ అని సీపీఎం ఒక పేర్కొంది. ఏప్రిల్‌లో జరిగే 24వ పార్టీ కాంగ్రెస్ సమావేశానికి ముందు పార్టీ రాష్ట్ర యూనిట్లకు పంపిన రాజకీయ తీర్మానాలపై పార్టీ ముసాయిదా నోట్‌లో దీనిపై వివరణ ఇచ్చింది.
అయితే, సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ కుట్రలు ఇప్పుడు కుంగిపోతున్నాయి, ప్రధాని మోడీని నియంతగా ముద్ర వేయడానికి, ఫాసిస్ట్‌గా పిలవడానికి జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీకి శిక్షణ ఇచ్చాడు అంటూ బీజేపీ నేత అమిత్ మాల్వియా కాంగ్రెస్‌పై విరుకుపడ్డారు. మరోవైపు సీపీఎం నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. 2026లో కేరళలో సీపీఎం ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, దీనిపై రాజకీయం ప్రారంభించింది. బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే కమ్యునిస్ట్ జనతా పార్టీ(సీజేపీ) బీజేపీ ఫాసిస్ట్ కాదని చెబుతోందని కేరళ కాంగ్రెస్, సీపీఎంపై ఆరోపణలు గుప్పించింది.