Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌పై అన్నామలై ఆగ్రహం..
- తమిళనాడులో కొనసాగుతున్న ‘‘హిందీ భాషా’’ వివాదం..
- నటుడు విజయ్‌పై బీజేపీ చీఫ్ అన్నామలై ఆగ్రహం..
- విజయ్ ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’ పాటిస్తున్నాంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో ‘‘త్రి భాషా విధానం’’పై కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని బలవంతంగా ప్రయోగిస్తు్న్నారంటూ తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా, హిందీపై నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శలు గుప్పించారు.
హిందీ భాష విషయంలో విజయ్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ అన్నామలై ఆరోపించారు. విజయ్‌ని ‘‘సోదరుడిగా’’ పలిచే అన్నామలై.. విజయ్ పాఠశాల ‘‘విజయ్ విద్యాశ్రమం’’లో మూడు భాషల విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారంటూ ప్రశ్నించారు. బయట మాత్రం ఆయన విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం(టీవీకే) రెండు భాషల వ్యవస్థ కోసం మాట్లాడుతోందని, ఇది ఆయన పార్టీ ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’ అంటూ అన్నామలై మండిపడ్డారు.
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
Read Also: Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్‌పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
‘‘ విజయ్‌కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు బోధించేది, ఆచరించు బ్రో. నువ్వు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు. మీరు నడుపుతున్న విజయ్ విద్యాశ్రమ పాఠశాలలో మూడు భాషలు ఉన్నాయి. కానీ మీ పార్టీ కార్యకర్తల పిల్లలు మాత్రం రెండు భాషల్లో చదువుకోవాలా..? ’’ అంటూ కోయంబత్తూర్‌లో జరిగిన ఒక సభలో అన్నామలై అన్నారు.
అంతకుముందు, త్రిభాషా విధానం, హిందీపై నలుడు విజయ్ విమర్శలు గుప్పించారు. టీవీకే మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. ఈ అంశంపై విభేదిస్తున్నట్లు నటిస్తూనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రం వైఖరిని విమర్శిస్తూ, ఆయన రాజకీయ పోరాటాన్ని చిన్నపిల్లల గొడవతో పోల్చారు. బీజేపీ, డీఎంకేలు సోషల్ మీడియాలో ‘‘హ్యాష్ ట్యాగ్స్’’తో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?