Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రానియా ప్రాంతంలో జరిగింది. ఒక వివాహం నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: CPM: మోడీ-ఆర్ఎస్ఎస్‌ను ‘‘ఫాసిస్టులు’’గా పిలువం.. సీపీఎం నిర్ణయంపై రాజకీయ వివాదం..
16 ఏళ్లకు పైబడిన బాలురను పెద్దలుగా పరిగణించి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ‘‘18 మందిని అరెస్ట్ చేశాం. అందరూ మైనర్లే. ఈ కేసులో అన్ని బాధిత బాలికలకు ప్రభుత్వం తరుఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాము’’ అని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా చెప్పారు. మన సమాజంలో అబ్బాయిలు ఇలాంటి నీచమైన పనులు చేయకుండా ఉండేందుకు, 16 ఏళ్లకు పైబడిన వారిని పెద్దలుగా పరిగణిస్తామని చెప్పారు. ఈ కేసులో 12-17 వయసు గల నిందితులను జువైనల్ హోమ్‌కి పంపించారు.
సోమవారం, సామూహిక అత్యాచారానికి గురైన బాలికలకు వైద్య పరీక్షలు జరిపించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఐదుగురు బాలికలపై బాలురు అత్యాచారం చేశారని, బాలికల్లో ముగ్గురు 12-16 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారని, ఆ అమ్మాయిలు రానియాలోని ఒక వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై కుటుంబీకులు రానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆదివారం వెలుగులోకి వచ్చిందని ఖుంటీ ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార చట్టాల కింద కేసులు నమోదు చేశారు.