Samsung Galaxy A57: శామ్‌సంగ్ నుండి కొత్తగా గాలక్సీ A 57 (Galaxy A57) 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో MIIT సర్టిఫికేషన్ ప్రకారం SM-A5760 మోడల్ నంబర్‌తో Galaxy A57 5G పూర్తి స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇందులో 6.6 అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ-O HDR డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసింగ్ కోసం 2.9GHz Octa-Core Exynos 1680 (4nm) ప్రాసెసర్, AMD Xclipse 550 GPUని ఉపయోగిస్తారు. 8GB లేదా 12GB ర్యామ్ ఎంపికలో ఉండగా.. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16, శామ్‌సంగ్ వన్ UI 8తో రానుంది.
Jio Recharge Plan: నెట్‌ఫ్లిక్స్‌తో వస్తున్న చౌకైన జియో 5G రీఛార్జ్ ప్లాన్.. ధర వివరాలివే
ఇందులో కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. రియర్ కెమెరాగా 50MP మెయిన్ కెమెరా (f/1.8, OIS), 12MP అల్ట్రా-వైడ్ (f/2.2), 5MP మాక్రో (f/2.4), LED ఫ్లాష్ ఉండనుండగా.. ఫ్రంట్ లో 12MP (f/2.2) కెమెరా ఉండనుంది. ఇంకా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు కూడా ఫోన్‌లో ఉంటాయి. ఇందులో ముఖ్యంగా IP67 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ ఉండగా, కేవలం 6.9mm మందం, 182 గ్రాముల బరువుతో A56 కంటే స్లిమ్ అండ్ లైట్‌గా రూపొందించబడింది. ఫోన్‌లో మెట్‌ల ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది.
ఇది 5000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే ఇది 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS + GLONASS, NFC ఫీచర్స్ ఉన్నాయి. Galaxy A57 5G మొబైల్ ను, Galaxy A37 5Gతో పాటు 2026 క్వార్టర్ 1లో లాంచ్ చేయబడే అవకాశం ఉంది.