Hafiz Saeed: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
PM Modi: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రీడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ‘‘ఇది యుద్ధానికి సమయం కాదు’’ అని చెబుతూనే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ‘‘యుద్ధభూమి విజయాలు శాశ్వత పరిష్కారానికి దారి తీయవు’’ అని సలహా ఇచ్చారు. Read Also: PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది.. కొనసాగుతున్న […]
PM Modi: పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో భారత్‌కి ద్రోహం, శత్రుత్వం ఎదురైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను మొదటిసారిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఇస్లామాబాద్‌కి జ్ఞానం రావాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. Read Also: Mohammed Shami: షమీ […]
PM Modi: అమెరికన్ పాడ్‌కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్‌తో కలిసి స్టేడియంలో తిరగడం గురించి చెప్పారు. ‘‘ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి […]
Mohammed Shami: ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సమయంలో, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. రంజాన్ మాసంలో షమీ ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ విమర్శలు గుప్పించారు. క్రికెట్ మ్యాచ్ సమయంలో ఉపవాసం ఉండకుండా నీరు, ఇతర డ్రింక్స్ తాగడాన్ని షాబుద్దీన్ తప్పుపట్టారు. షమీ ఒక ‘‘క్రిమినల్’’ అంటూ దుయ్యబట్టారు. అయితే, ఈ విషయంపై షమీకి మద్దతుగా యావత్ దేశం నిలబడింది.
BJP MLA: కేదార్నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.
BYD: చైనీస్ EV ఆటోమేకర్ BYD తన కొత్త 2025 సీల్, అట్టో 3 మోడళ్లను రిలీజ్ చేసింది. గతంలో పోలిస్తే మరింత స్టైలిష్‌గా, మరిన్ని ఫీచర్లతో ఈ కార్లు విడుదలయ్యాయి. భారతదేశంలో BYD ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, అప్డేట్స్ ప్రకటించింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో గిరిజనుల మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేసింది. ఈ సంఘటనలో వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఏఎస్ఐ కూడా మరణించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. హింసకు సంబంధించి ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ మరణించగా, ఇతర పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని రేవా డీఐజీ సాకేత్ పాండే తెలిపారు. Read Also: Pakistan: పాక్ ఆర్మీని […]
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గత 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు అంతా సిద్ధమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌కి చెందిన క్రూ-10 ఐఎస్ఎస్ని చేరుకుంది. శుక్రవారం ఫ్లోరిడా నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా క్రూ-10 అంతరిక్షంలోకి వెళ్లింది. రిటర్న్ జర్మీలో సునీతా విలియమ్స్ భూమికి పైకి వస్తుంది. అయితే, సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడపడం వల్ల సునీతా విలియమ్స్, […]
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్‌తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్‌ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ […]