Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.
BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్‌ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
Ranya Rao Case: సినీనటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ప్రత్యేకమైన బెల్టు సాయంతో నడుముకు చుట్టుకుని తీసుకువస్తుండగా, బెంగళూర్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఈ కేసులో గోల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు భావిస్తుండటంతో ఇటు ఈడీ, అటు సీబీఐ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి.
US Missile Strike: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. Read […]
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘‘హిందీ’’ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయంపై పవన్ కామెంట్స్ తమిళనాట కాక పుట్టించాయి.
Yogi Adityanath: హోలీ పండగ వేళ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మాట్లాడుతూ.. సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో మరే దేశానికి లేదా మరే మతానికి ‘‘సనాతన ధర్మం’’ వంటి గొప్ప పండగలు, వేడుకల సంప్రదాయం లేదని ఆయన అన్నారు. గోవధదారులకు మద్దతు ఇచ్చిన వారు, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Crime: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. ఒక మహిళా సబ్-ఇన్స్పెక్టర్పై ఒక కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ అస్లాంపై తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
Ranya Rao Case: బంగారం అక్రమ రవాణా కేసులో సినీ నటి రన్యా రావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనల్లో ఏకీభవించారు.
Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.