Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ […]
Ranya Rao: రన్యా రావు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో కేసు సంచలనంగా మారింది. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యా రావును అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఆమె సవతి తండ్రి, డీజీపీ(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) కె రామచంద్రరావుని ప్రభుత్వం తప్పనిసరి […]
Rahul Gandhi: ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్నేయాసియా దేశమైన వియత్నాం వెళ్తున్నారు. అయితే, ఈ విషయంపై బీజేపీ అతడిని ప్రశ్నించింది. వివరాలు వెల్లడించకుండా రాహుల్ గాంధీ తరుచుగా వియత్నాం, ఇతర దేశాలకు పర్యటించడాన్ని శనివారం బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తికి ఇవి తగవని, ‘‘జాతీయ భద్రత’’ గురించి ఆందోళనను బీజేపీ లేవనెత్తింది.
e-commerce: నిబంధనలకు అనుగుణంగా లేని ప్రొడక్ట్ పంపిణీని అరికట్టడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చర్యలకు ఉపక్రమించింది. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిడ్డంపులపై దాడులు నిర్వహించింది. లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లోని ఆయా సంస్థల వేర్హౌజులపై దాడులు నిర్వహించింది.
DK Shivakumar: కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ముస్లిం వర్గాన్ని సంతృప్తి పరచడానికి, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Odisha: ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ)కి చెందిన మాజీ గిరిజన ఎంపీ, గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ, సుశ్రీ సంగీత సాహూ అనే బ్రహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన ఒక రోజు తర్వాత ఆయన కుటుంబాన్ని తెగ నుంచి బహిష్కరించారు. గోవాలో వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ‘‘భటర సమాజ్ కేంద్ర కమిటీ’’ ఈ నిర్ణయం తీసుకుంది
Bihar: బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హోలీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. శనివారం ఆర్జేడీ నేత తన మద్దతుదారులతో హోలీని జరుపుకుంటున్న సమయంలో, యూనిఫాంలో ఉన్న ఒక పోలీస్ అధికారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన చర్యలపై అధికార జేడీయూ, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడి అధికారులు మాత్రం వివరాలను విడుదల చేయలేదు.
మొత్తం 43 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలను 3 జాబితాలుగా వర్గీకరించారు. ఈ జాబితాలో పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.
Rabies Deaths: భారతదేశంలో ‘‘రేబిస్ వ్యాధి’’ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 36 శాతం మరణాలు ఇండియాలోనే ఉంటున్నాయని చెప్పింది. అధికారిక గణాంకాల పరిశీలిస్తే.. దేశంలో నివేదించబడిన రేబిస్ కేసులు, మరణాలలో దాదాపుగా 30-60 శాతం 15 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలే ఎక్కుగా ఉంటున్నారని తేలింది. చాలా వరకు వీటిని పిల్లలు నివేదించకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పింది. 2024 క్యాలెండర్ ఇయర్లో 5.19 […]