BYD: చైనీస్ EV ఆటోమేకర్ BYD తన కొత్త 2025 సీల్, అట్టో 3 మోడళ్లను రిలీజ్ చేసింది. గతంలో పోలిస్తే మరింత స్టైలిష్‌గా, మరిన్ని ఫీచర్లతో ఈ కార్లు విడుదలయ్యాయి. భారతదేశంలో BYD ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, అప్‌డేట్స్ ప్రకటించింది.
2025 BYD సీల్: అప్‌డేట్స్
BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్ తీసుకువచ్చింది. స్టాండర్ట్ పవర్ సన్ షేడ్, మెరుగైన ఫ్యూరిఫికేషన్ కోసం ఏసీ సిస్టమ్స్ అప్‌డేట్ చేయబడింది. సిల్వలర్ ప్లేటెడ్ డిమ్మింగ్ కానోపీ, వైర్ లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ కలిగి ఉంది. పెర్ఫామెన్స్ వేరియంట్ కోసం DiSus-C ఇంటెలిజెంట్ డంపింగ్ సిస్టమ్ ఉంది. ఈ సాంకేతికత రియల్ టైమ్ డ్రైవింగ్ పరిస్థితులను బట్టి సస్పెన్షన్లను సర్దుబాటు చేయడానికి కార్‌కి అనుమతి ఇస్తుంది. మరో వేరియంట్ సీల్ ప్రీమియం, ఫ్రీక్వెన్సీ సెలక్టివ్ డ్యాంపర్‌ని పొందుతుంది.
2025 BYD సీల్: బ్యాటరీ, రేంజ్ , వేరియంట్లు
BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో సీల్ డైనమిక్, సీల్ ప్రీమియం, సీల్ ఫెర్ఫామెన్స్ వేరియంట్లను కలిగి ఉంది. సీల్ డైనమిక్ 61.44 kWh బ్యాటరీని కలిగి ఉండి, 510 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్రీమియం, ఫెర్ఫామెన్స్ వేరియంట్లు 82.56 kW బ్యాటరీ ప్యాక్ ఉంది. వరసగా 650 కి.మీ, 580 కి.మీ రేంజ్ కలిగి ఉంటుంది. సంస్థ సీల్ ధరల్ని ఇంకా ప్రకటించలేదు.
2025 BYD అట్టో 3: అప్‌డేట్స్
BYD అట్టో 3 ఇప్పుడు పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్స్‌తో వస్తోంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అప్‌గ్రేడ్ చేయబడిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) తక్కువ-వోల్టేజ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. కొత్త బ్యాటరీ ఐదు రెట్లు మెరుగైన డిశ్చార్జ్ వినియోగాన్ని కలిగి ఉండటంతో పాటు 15 ఏళ్ల లైఫ్ ఉంటుందని BYD పేర్కొంది.
2025 BYD అట్టో 3: బ్యాటరీ, రేంజ్, వేరియంట్లు
బీవైడీ అట్టో 3 డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ అనే మూడు వేరియంట్లను కలిగి ఉంది. డైనమిక్ 49.92 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ARAI ప్రకారం, 468 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఇది 580 కి.మీ రేంజ్ ఇస్తుంది.
2025 BYD సీల్, అట్టో 3: బుకింగ్, ధరలు
BYD 2025 సీల్,అట్టో 3 బుకింగ్స్ ప్రారంభించింది. అయితే, సంస్థ ఇంకా సీల్ ధరల్ని ప్రకటించలేదు. రూ. 1.5 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. ఇక BYD తొలి వార్షికోత్సవం సందర్భంగా, మొదటి 3000 మంది కస్టమర్లకు 2024 మోడళ్ల ధరకే 2025 బీవైడీ అట్టో 3ని అందిస్తున్నట్లు ప్రకటించింది. BYD 2025 అట్టో 3 ప్రస్తుత ప్రారంభ ధర రూ. 24.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.