Sunita Williams: సునీతా విలియమ్స్‌కి తీవ్ర ఆరోగ్య సమస్యలు.. భూమికి వచ్చిన తర్వాత భరించలేని బాధ..
- సునీతా విలియమ్స్‌కి ఆరోగ్య సమస్యలు..
- సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంతో ఇబ్బందులు..
- బేబీ ఫుట్, ఎముకల సాంద్రత నష్టం..
- భూమిపైకి వచ్చిన కొన్ని నెలల పాటు తీవ్రమైన బాధ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గత 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు అంతా సిద్ధమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌కి చెందిన క్రూ-10 ఐఎస్ఎస్‌ని చేరుకుంది. శుక్రవారం ఫ్లోరిడా నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా క్రూ-10 అంతరిక్షంలోకి వెళ్లింది. రిటర్న్ జర్మీలో సునీతా విలియమ్స్ భూమికి పైకి వస్తుంది.
అయితే, సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడపడం వల్ల సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారు భూమి పైకి రావడం అత్యంత బాధతో కూడుకున్నది. వీరిద్దరికి ‘‘బేబీ ఫుట్’’ అని పిలిచే ఆరోగ్య పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. వ్యోమగామలు నెలల తరబడి అంతరిక్షంలో ఉండటంతో వారి పాదాలు శిశువుల పాదాల వలే మృదువుగా మారుతాయి. అంటే వారు నడవడానికి తీవ్రమైన బాధను అనుభవిస్తారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
భూమిపై నడుస్తున్నప్పుడు మన పాదాల చర్మం గురుత్వాకర్షణ, ఘర్షణ కారణంగా మందంగా తయారవుతుంది. ఇది మనం నడిచేటప్పుడు చాలా నిరోధకతను తట్టుకుంటుంది. నొప్పి, అసౌకర్యం నుంచి రక్షిస్తుంది. నెలల తరబడి అంతరిక్షంలో ఉన్నవారు గట్టిపడిన చర్మం కోల్పోతారు. పాదాలు చాలా మృదువుగా తయారవుతాయి. మళ్లీ పాదాలు నార్మల్ స్థితికి వచ్చే వరకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Read Also: Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
మరోవైపు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఎములక సాంద్రత కూడా గణనీయంగా తగ్గుతుంది. నాసా ప్రకారం, అంతరిక్షంలో సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రతీ నెల వ్యోమగాములు ఒక శాతం డెన్‌సిటీని కోల్పోతారు. కండరాలు కూడా బలహీనపడుతాయి. ఫలితంగా భూమిపైకి వచ్చిన కొన్ని రోజుల వరకు వారు సాధారణంగా నడవలేరు. దీనికి అనేక నెలల శిక్షణ అవసరం అవుతుంది.
ఇవే కాకుండా వ్యోమగాముల రక్త పరిమాణం కూడా తగ్గిపోతుంది. గుండె గురుత్వాకర్షణ లేని కారణంగా రక్తాన్ని పెద్దగా కష్టపడి పంప్ చేయాల్సిన పని ఉండదు. శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిస్తుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టవచ్చు.
అంతరిక్షంలో గడపడం వల్ల అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్‌కు గురికావడం జరుగుతుంది. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం మానవులను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది. అయితే, అంతరిక్షంలో ఉండే వారికి ఈ వెసులుబాటు ఉండదు. వ్యోమగాములు ప్రధానంగా మూడు రకాల రేడియేషన్‌కు గురవుతారని నాసా పేర్కొంది. వీటిలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సూర్యుని నుండి వచ్చే సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!