Chahal - Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది.
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్‌సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత,
Dihuli Massacre: నవంబర్ 18, 1981న సాయుధ దుండగుల గుంపు ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిహులి గ్రామంలోని ఎస్సీ కాలనీపై విరుచకుపడ్డారు. ఇళ్లలోని పురుషులు, మహిళలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 మంది మరణించారు. ఈ ఘటన ‘‘దిహులి ఊచకోత’’గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన జరిగిన 44 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. దోషులుగా తేలిన ముగ్గురికి కోర్టు ‘‘మరణశిక్ష’’ విధించింది. దోషుల్లో ఒకరు పరారీలో ఉన్నారు.
Chhaava: నాగ్‌పూర్ అల్లర్ల, హింస నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ‘‘ఛావా’’ సినిమాపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర తెరపైకి వచ్చిందని, ఇది మొఘల్ పాలకుడు ఔరంగజేబుపై ఆగ్రహాన్ని రేకెత్తించిందని ఆయన అన్నారు. సోమవారం రాత్రి నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Viral video: తన భార్యకు మొబైల్ ఫోన్ కొనిస్తున్న వ్యక్తిపై ‘‘గర్ల్ ఫ్రెండ్’’ దాడి చేసిన సంఘటన వైరల్‌గా మారింది. బీహార్ చాప్రాలో ఒక వ్యక్తి తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న అతడి గర్ల్ ఫ్రెండ్, మొబైల్ షాపులోనే అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
PM Modi: దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. సునీతాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’లో కొన్ని నెలలుగా చిక్కుబడిపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ ‘‘స్టార్ లైనర్’’లో సాంకేతిక సమస్యలు ఏర్పడం, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
Nagpur Violence: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో అగ్గిరాజేస్తోంది. నాగ్‌పూర్‌లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక్కసారి ముస్లిం మూక దాడులకు పాల్పడింది. దీంతో నగరంలో హింస చెలరేగింది. ప్రైవేట్ ఆస్తులు, వాహనాలు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు ‘‘కుట్ర’’ ప్రకారం జరిగాయని, మణిపూర్ జాతి […]
PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే తనకు జీవిత లక్ష్యం గురించి తెలిసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ వల్లే సేవ గొప్పతనం, దేశ స్పూర్తి పెరిగిందని వెల్లడించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ తాను ఒక వ్యక్తిగా ఎదిగేందుకు కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
PM Modi: 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడి "ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం" అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్లో ఒక్క అల్లరి కూడా జరగలేదని చెప్పారు.
Lex Fridman: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్, ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని వర్తమాన అంతర్జాతీయ పరిణామాలు, పాక్ అంశం, ఉక్రెయిన్ వార్, డొనాల్డ్ ట్రంప్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఈ ఇంటర్వ్యూ కోసం తాను 45 గంటల పాటు ‘‘ఉపవాసం’’లో ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్మాన్ చెప్పారు. ‘‘సరైన మనస్తత్వాన్ని పొందడానికి’’ దాదాపుగా 2 రోజలు ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రధాని మోడీని ఆశ్చర్యపరిచారు.