Vodafone Idea: భారత టెలికాం దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఒప్పందాలు ప్రకటించాయి. ఇప్పటికే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కూడా స్టార్‌లింక్‌తో సహా వివిధ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లతో చర్చల్ని ప్రారంభించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది.
Jaya Bachchan: ప్రముఖ బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. నిత్యం బీజేపీ, బీజేపీ నాయకులను సభలో విమర్శించే జయాబచ్చన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 2004 నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న జయా.. ఇటీవల ఒక డిబేట్లో రాజకీయాల్లోకి సినీ యాక్టర్స్ ప్రవేశం గురించి, వారి ప్రజాదరణ గురించి మాట్లాడారు. ప్రజాదరణ రాజకీయ పార్టీలకు ఎలా ప్రయోజనకరంగా మారుతుందో వెల్లడించారు. రాజకీయాల్లో సినీ నటులకు ఉండే క్రేజ్ ఎవరికి ఉందని ప్రశ్నించిన నేపథ్యంలో,…
RSS: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాద మహారాష్ట్రలో ఉద్రిక్తతలకు కారణమైంది. సోమవారం రోజు నాగ్‌పూర్‌లో నమాజ్ పూర్తైన తర్వాత అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. మరో వర్గం ఇళ్లు, ఆస్తులు, వాహనాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఫాహిమ్ ఖాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇ
Trump World Center: భారతదేశంలో మొట్టమొదటి ట్రంప్ బ్రాండెడ్ ఆఫీస్ ‘‘ట్రంప్ వరల్డ్ సెంటర్’’ పూణేలో నిర్మించబోతున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రాపర్టీ డెవలప్మెంట్ పార్ట్నల్ అయిన ట్రిబెకా డెవలపర్స్ బుధవారం దేశంలో మొట్టమొది ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ రియల్ ఎస్టే్ట్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. $289 మిలియన్లకు పైగా అమ్మకాలను లక్ష్యంగా చేసుకుని దీనిని ప్రారంభించారు.
Tesla Cars: అమెరికాలో ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, లాస్ వేగాస్‌లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. రాత్రిపూట లాస్ వేగాస్ స్వీస్ సెంటర్లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు.
Tamil Nadu: తమిళనాడు అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం జరిగింది. ‘‘మోక్షం’’ పేరులో ఒక ఫ్రెంచ్ మహిళను నమ్మించిన టూరిస్ట్ గైడ్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్రాన్స్‌కి చెందిన 46 ఏళ్ల మహిళ జనవరి 2025లో తిరువణ్ణామలైలో ఒక ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గతేడాది కొండచరియలు విరిగిపడటంతో దీపమలై కొండపైకి ప్రజలను అనుమతించడం నిషేధించారు.
Merchant Navy Officer Murder: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణ హత్య సంచలనంగా మారింది. లవర్ సాయంతో సౌరభ్ రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి(27) దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగింది. అమెరికాకు చెందిన ఒక కంపెనీలో మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ గత నెలలో తన ఆరేళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియా వచ్చారు.
Nagpur Violence: నాగ్‌పూర్ హింసలో దుర్మార్గమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మతోన్మాద గుంపు ప్రార్థనలు ముగిసిన తర్వాత వీధుల్లోకి వచ్చి, నినాదాలు చేస్తూ హింసకు తెగబడ్డారు. వాహనాలను తగులబెట్టడంతో పాటు ఒక వర్గం ఇళ్లను, ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశారు.
Nagpur riots: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో, నాగ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కొందరు ముస్లిం మూక దాడులకు పాల్పడింది. అయితే, ఈ అల్లర్లకు సంబంధించి కీలక సూత్రధారి ఫహీమ్ ఖాన్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడైన ఇతడిని శుక్రవారం వరకు కస్టడీక పంపారు.
Chahal - Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్‌ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది.