Disha Salian: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించింది. ప్రారంభంలో, దీనిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్)గా నమోదు చేశారు. ఈ మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. దిశా సాలియన్ బాలీవుడ్లో అనేక మందికి మేనేజర్‌గా పనిచేశారు. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు.
UPI: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్లు చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుండి తొలగించనున్నారు. ఈ నిర్ణయం ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ వంటి యూపీఐ యాప్‌లపై ప్రభావం చూపుతుందని NPCI ప్రకటించింది.
RG Kar protests: గతేడాది, కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ పీజీ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై యావత్ దేశం నిరసన, ఆందోళన నిర్వహించాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేశారు.
Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్‌పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు. ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్ […]
Bengaluru: ఇప్పుడున్న జనరేషన్లో యువత పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా మహిళల కోరికలు తీర్చడానికి తాము సరిపోమని, ప్రస్తుతం జరుగుతున్న మోసాలు చూసి తమకు పెళ్లి కాకుంటేనే బాగుంటుందనే వైఖరితో పురుషులు ఉంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు వింతగా అనిపిస్తున్నాయి. తాజాగా, బెంగళూర్‌కి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్య గురించి చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది.
High Court: ఇటీవల కాలంలో విడాకులు, తప్పుడు కేసులను పేర్కొంటూ భర్తల్ని హింసించే భార్యల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా లేని ‘‘భరణాన్ని’’ డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఇటీవల సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు కీలక వ్యాఖ్యలు చేశాయి. తాజాగా, ఢిల్లీ హైకోర్టు మహిళ దాఖలు చేసిన ‘‘భరణం’’ పిటిషన్‌పై కామెంట్స్ చేసింది. సంపాదించే సామర్థ్యం ఉన్న, అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి మధ్యంతర భరణాన్ని కోరకూడదని ఢిల్లీ హైకోర్టు […]
YouTube: యూట్యూబ్‌లో చూసి సొంత వైద్యం చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ మధురలో ఓ వ్యక్తి, తన కడుపు నొప్పికి సొంతగా ‘‘ఆపరేషన్’’ చేసుకోవడానికి ప్రయత్నించాడు. యూట్యూబ్‌లో చూస్తూ, తనకు తాను సర్జరీ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు.
Allahabad HC: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) కేసును విచారిస్తున్న సందర్భంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా తాడు తెంచడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదని చెప్పింది. కానీ, ఇది తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది. కాస్గంజ్ లోని ప్రత్యేక న్యాయమూర్తి పోక్సో కోర్టు సమన్ల ఉత్తర్వులను జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిని సింగిల్ బెంచ్ సవరించి, కొత్త సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. అత్యాచారం అభియోగంపై…
Yogi Adiyanath: దేశవ్యాప్తంగా ఔరంగజేబు సమాధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నాగ్‌పూర్‌లో అల్లర్లకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను కీర్తించే వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కొత్త భారతదేశమని, ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహ చర్య అని అన్నారు. ఔరంగజేబు పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసి, మన విశ్వాసంపై దాడి చేసిన వ్యక్తులను […]
Digital Arrest: దేశంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. సీబీఐ అధికారుమని బెదిరించిన మోసగాళ్లు ఆమె వద్ద నుంచి రూ.20 కోట్లు కొల్లగొట్టారని గురువారం పోలీసులు తెలిపారు. మహిళ నుంచి డబ్బు వసూలు చేయడానికి సీబీఐ అధికారులుగా నటిస్తూ బెదిరించాడని, 2024 డిసెంబర్ 26 నుంచి ఈ సంవత్సరం మార్చి 3 మధ్య జరిగిన ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు […]