Tata Motors: టాటా మోటార్స్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. టాటా మోటార్స్ కుటుంబంలో చేరిన విక్కీ కౌశల్, 'టేక్ ది కర్వ్' ప్రచారం చేయనున్నారు. టాటా మోటార్స్ టాటా కర్వ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విక్కీ కౌశల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛావా, ఉరి, సామ్ బహదూర్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించడంతో పాటు చారిత్రక, దేశభక్తి ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని పోషించిన విక్కీ కౌశల్, స్వదేశీ ఆటోమేకర్ అయిన టాటాకు సరిగా సరిపోతాడని ఆ సంస్థ భావించింది.
Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ […]
Congress: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీ(పీపీపీ) అని బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ దేశ జాతీయదినోత్సవం వేళ ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వివాదాస్పదంగా మారింది. ఆ కార్యక్రమానికి ప్రముఖ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ హాజరైన తర్వాత బీజేపీ తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ‘‘ఇది భారత జాతీయ కాంగ్రెస్ కాదు, ఇది పీపీపీ- పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీగా మారింది’’ అని దాడి చేసింది.
Karnataka: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్‌తో సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Amit Shah: కేంద్రం హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానమిస్తూ.. ‘‘ఈ దేశంలో మార్చి 31, 2026 నాటికి నక్సలిజం నిర్మూలించబడుతుందని చెబుతున్నా’’ అని అన్నారు. ఇటీవల, వరసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న పదవీచ్యుతురాలైంది. హింసాత్మక ఘటనలతో ఆమె భారత్ పారిపోయి వచ్చింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగాయి. అయితే, అవామీ లీగ్ పార్టీని రద్దు చేస్తారని, పార్టీని నిషేధించాలని యూనస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలు వచ్చాయి.
Chhaava: ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, తన సహచరులతో కలిసి బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ చూశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఔరంగజేబు, మరాఠాల మధ్య ఘర్షణలను సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఛావా సినిమాను చూడాలని మౌర్య కోరారు. దీని ద్వారా ఔరంగజేబు క్రూరత్వం ఆమెకు తెలుస్తుందని ఆయన అన్నారు.
MH370 Disappearance: 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మలేషియా విమానం MH370, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అత్యాధునిక సాంకేతికత, సముద్రంలో వేల మైళ్లను జల్లెడ పట్టినా కూడా ఒక్క శకలం కూడా లభించలేదు. అసలు ఈ విమానానికి ఏమైదనే విషయాన్ని ఇప్పటి వరకు ఇన్వెస్టిగేటర్లు కనిపెట్టలేకపోయారు. మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కి 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైంది. ఇప్పటివరకు ఈ MH370 విమానం అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
Meerut murder: మీటర్లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని భార్య ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లాలు కలిసి దారుణంగా హత్య చేశారు. విదేశాల్లో ఉండే సౌరభ్, తన 6 ఏళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తర్వాత, ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి, 15 ముక్కలుగా చేసి, డ్రమ్ముల్లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. అయితే, ఈ హత్యలో సంచలన […]
Pakistan: పాకిస్తాన్ వరసగా దాడులకు గురవుతోంది. ముఖ్యంగా బెలూచిస్తాన్‌లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది. బెలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల క్రితం, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసి, 200 మందికి పైగా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందిని హతం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా బీఎల్ఏ విరుచుకుపడింది.