Bengaluru: ఇప్పుడున్న జనరేషన్‌లో యువత పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా మహిళల కోరికలు తీర్చడానికి తాము సరిపోమని, ప్రస్తుతం జరుగుతున్న మోసాలు చూసి తమకు పెళ్లి కాకుంటేనే బాగుంటుందనే వైఖరితో పురుషులు ఉంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు వింతగా అనిపిస్తున్నాయి. తాజాగా, బెంగళూర్‌కి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్య గురించి చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది.
తన భార్య తనను వేధిస్తోందని సదరు టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో కలిసి జీవించడానికి భార్య రోజుకు రూ. 5000 డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. తన అందం దెబ్బతింటుందని, పిల్లలు కనడం ఇష్టం లేదని, బదులుగా 60ఏళ్ల వచ్చిన తర్వాత పిల్లల్ని దత్తత తీసుకుందామని పట్టుబడుతోందని శ్రీకాంత్ వైలికావల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిని నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్‌గా నమోదు చేసి, కేసుని తర్వాత సదాశివనగర్ పోలీసులకు బదిలీ చేశారు. అయితే, శ్రీకాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోజుకు రూ. 5000 డిమాండ్ గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: మోడీ అంటే నాకు గొప్ప గౌరవం.. కానీ.. ఆయన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి?
2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట, వివాహం జరిగినప్పటి నుంచి ఒక్క రోజు కూడా తనతో సరిగా కలిసి ఉండలేదని, ఆమె, ఆమె తల్లిదండ్రులు డబ్బు కోసం తరుచుగా తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు భార్య తనతో వాదించేదని, వీడియో కాల్స్ సమయంలో తన ల్యాప్‌టాప్ ముందు డ్యాన్స్ చేసేందని, ఎక్కువ సౌండ్ పెట్టుకుని మ్యూజిక్ వినేదని, తన పనికి అంతరాయం కలిగిస్తుందని అతను ఆరోపించాడు. విడాకుల కోసం సమ్మతి తెలిపేందుకు పరిహారంగా ఆమె రూ. 45 లక్షల డిమాండ్ చేస్తుందని శ్రీకాంత్ ఆరోపించారు.
తన భార్య బ్లాక్‌మెయిల్ చేస్తుందని, తన దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటానని, ప్రాణం తీసుకుంటానని నోట్ రాసి బెదిరిస్తోందని అతను చెప్పాడు. ఆమె తనపై శారీరకంగా దాడి చేసిందని ఆరోపించాడు. భార్యభర్తల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారింది. శ్రీకాంత్ తన భార్య రోజుకు రూ. 5000 డిమాండ్ చేస్తున్న వీడియోను విడుదల చేసింది. అయితే, భార్య తన భర్త చేసిన ఆరోపణల్ని ఖండించింది.