Zakir Naik: భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్‌కి దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో జకీర్ నాయక్, మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్‌లను కలిసిన తర్వాత భారత్, పాకిస్తాన్ వైఖరి ఏమిటో తెలిసిందని వ్యాఖ్యానించింది.
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిలేషన్)పై చెన్నై వేదిక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సమావేశానికి స్టాలిన్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి వారు హాజరయ్యారు. మొత్తంగా ఈ సమావేశానికి 5 రాష్ట్రాల నుంచి 14 మంది నాయకులు పాల్గొన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు…
Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు.
Kerala: 2005లో కేరళలో జరిగిన బీజేపీ కార్యకర్త ఎలాంబిలాయి సూరజ్ హత్య కేసులో 9 మంది సీపీఎం కార్యకర్తలను కోర్టు దోషులుగా తేల్చింది. దోషుల్లో సీఎం పినరయి విజయన్ ప్రెస్ సెక్రటరీ సోదరుడు కూడా ఉన్నాడు. శుక్రవారం వీరిందరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిని వారిలో టీకే రజీష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇతను 2012లో జరిగిన టిపీ చంద్రశేఖరన్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరో దోషి పీఎం మనోరాజ్, ఇతను సీఎం […]
Aurangzeb tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను, పురావస్తు ప్రదేశాలను జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా…
Amit Shah: ‘హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు’’ అని ఆయన అన్నారు.
Tata Motors: టాటా మోటార్స్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. టాటా మోటార్స్ కుటుంబంలో చేరిన విక్కీ కౌశల్, 'టేక్ ది కర్వ్' ప్రచారం చేయనున్నారు. టాటా మోటార్స్ టాటా కర్వ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విక్కీ కౌశల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛావా, ఉరి, సామ్ బహదూర్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించడంతో పాటు చారిత్రక, దేశభక్తి ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని పోషించిన విక్కీ కౌశల్, స్వదేశీ ఆటోమేకర్ అయిన టాటాకు సరిగా సరిపోతాడని ఆ సంస్థ భావించింది.
Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ […]
Congress: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీ(పీపీపీ) అని బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ దేశ జాతీయదినోత్సవం వేళ ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వివాదాస్పదంగా మారింది. ఆ కార్యక్రమానికి ప్రముఖ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ హాజరైన తర్వాత బీజేపీ తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ‘‘ఇది భారత జాతీయ కాంగ్రెస్ కాదు, ఇది పీపీపీ- పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీగా మారింది’’ అని దాడి చేసింది.