Yogi Adiyanath: దేశవ్యాప్తంగా ఔరంగజేబు సమాధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నాగ్‌పూర్‌లో అల్లర్లకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను కీర్తించే వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కొత్త భారతదేశమని, ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహ చర్య అని అన్నారు. ఔరంగజేబు పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసి, మన విశ్వాసంపై దాడి చేసిన వ్యక్తులను […]
Digital Arrest: దేశంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’కి గురైంది. సీబీఐ అధికారుమని బెదిరించిన మోసగాళ్లు ఆమె వద్ద నుంచి రూ.20 కోట్లు కొల్లగొట్టారని గురువారం పోలీసులు తెలిపారు. మహిళ నుంచి డబ్బు వసూలు చేయడానికి సీబీఐ అధికారులుగా నటిస్తూ బెదిరించాడని, 2024 డిసెంబర్ 26 నుంచి ఈ సంవత్సరం మార్చి 3 మధ్య జరిగిన ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు […]
Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్‌గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు…
Meerut Murder: మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య ముస్కాన్ రస్తోగి, తన లవర్ సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసింది. శవాన్ని 15 ముక్కలుగా నరికి, డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేసింది. మార్చి 04న జరిగిన ఈ హత్య, సౌరభ్ మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వేరే దేశంలో పనిచేస్తున్న సౌరభ్, తన 6 ఏళ్ల కూతురు పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తర్వాత, పక్కా ప్లాన్‌లో […]
Madras High Court: భార్యలు పోర్న్ చూడటం విడాకులకు కారణం కాదని, వివాహం చేసుకున్న తర్వాత మహిళలు హస్త ప్రయోగం చేసుకునే హక్కును కలిగి ఉంటారని, వారి లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడులో ఒక వ్యక్తి దిగువ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో బుధవారం న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
Karnataka: పోలీస్ ఉన్నతాధికారులు, న్యాయ శాఖ నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించింది. 2022లో జరిగిన ‘‘హుబ్బళ్లీ అల్లర్ల’’కు సంబంధించిన కేసును ఉపసంహరించుకుంది. ఈ కేసు ఉపసంహరణ ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని పోలీసులు, న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు అధికారిక పత్రాలు సూచించాయి. ఓల్డ్ హుబ్బళ్లీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో అల్లర్ల సమయంలో స్టేషన్‌ని ధ్వంసం చేశారు. నిందితుల్లో ఒకరైన ఎంఐఎం కార్పొరేటర్, నిరసన కోసం జనాన్ని […]
Merchant Navy officer Murder: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ని భార్య ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంత దారుణంగా ఏ మహిళ చంపుతుందా..? అని మాట్లాడుకుంటున్నారు.
Congress: వరస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత పునరుద్ధరణకు పార్టీలో రంగం సిద్ధమవుతుంది.
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు మోడీ దౌత్య వైఖరిని తప్పుబడుతూ మూర్ఖంగా(ఎగ్ ఆన్ ఫేస్) వ్యవహరించానంటూ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనియాడారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా, సొంత పార్టీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు.