Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్‌పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు.
ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడైన రజ్వీ.. ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్ర చిత్రీకరణ హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా ఉందని, నాగ్‌పూర్లో చెలరేగిన మత హింస వంటి అశాంతిని కలిగించే విధంగా చిత్రీకరణ ఉందని పేర్కొన్నాడు. ఛావా సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలో వాతావరణం క్షీణించిందని, ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టారని, అందుకే హిందూ సంస్థల నాయకులు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Read Also: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..
‘‘భారతదేశ ముస్లింలు చక్రవర్తి ఔరంగజేబును తమ ఆదర్శంగా మరియు నాయకుడిగా పరిగణించరు. మేము అతన్ని కేవలం ఒక పాలకుడిగా మాత్రమే పరిగణిస్తాము, అంతకు మించి ఏమీ లేదు’’ అని రజ్వీ అన్నారు. నాగ్‌పూర్‌లో శాంతి కోసం విజ్ఞప్తి చేశానని, ఉద్రిక్తతలు పెరగడంతో వారిని శాంతింపజేయడానికి ఈ ప్రాంతంలోని మసీదుల ఉలామాలు, ఇమామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నానని కూడా చెప్పాడు.
ఇటీవల విడుదలైన ‘‘ఛావా’’ సినిమా మారాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందించబడింది. మరాఠాలకు, మొఘలు పాలకులకు మధ్య ఘర్షణ, యుద్ధాలను ఈ సినిమాలో చూపించారు. మరాఠాలు, హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ని ఔరంగజేబు క్రూరంగా హింసించడాన్ని సినిమాలో చూపించారు. అప్పటి నుంచి మహారాష్ట్రతో పాటు హిందువుల్లో భావోద్వేగం పెరిగింది. ఆ తర్వాత మరాఠా గడ్డపై ఔరంగజేబు సమాధి ఉండకూడదనే నిరసనలు ప్రారంభమయ్యాయి.