UPI: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లు చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుండి తొలగించనున్నారు. ఈ నిర్ణయం ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ వంటి యూపీఐ యాప్‌లపై ప్రభావం చూపుతుందని NPCI ప్రకటించింది.
ఇన్‌యాక్టివ్‌గా ఉన్న నంబర్ల వల్ల సాంకేతిక సమస్యలు, మోసాలకు కారణం అవుతున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నందున NPCI నిర్ణయం తీసుకుంది. ఇన్‌యాక్టివ్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలకు కారణమవుతున్నాయి. టెలికాం ప్రొవైడర్లు ఈ ఉపయోగించని నెంబర్లను వేరేవారికి కేటాయించినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఇది మోసపూరిత కార్యకలాపాలకు ఒక కారణం అవుతుంది.
Read Also: RG Kar protests: “ఆర్‌జీ కర్” నిరసనల్లో పాల్గొన్న డాక్టర్‌పై మమతా సర్కార్ ప్రతీకారం..
ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, యూపీఐ లావాదేవీల కోసం యూజర్లు యాక్టివ్‌గా ఉండే నంబర్లను వారి బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం ముఖ్యం. యూజర్లు వారి మొబైల్ నెంబర్ యాక్టివిటీని వెరిఫై చేయాలి. యూపీఐ యూజర్లు తమ లింక్ చేయని మొబైల్ నంబర్ల స్టేటస్‌ని వారి టెలికాం ప్రొవైడర్లతో చెక్ చేసుకోవాలి. ఒక నంబర్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే లేదా ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే దానిని వెంటనే తిరిగి యాక్టివ్ చేయాలి లేదా కొత్త మొబైల్ నెంబర్‌తో వారి బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయాలి. ఈ చర్యల వల్ల యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఉండు. దీంతో పాటు సైబర్ క్రైమ్ ప్రమాదాలను నివారించవచ్చు.
బ్యాంకులు, యూపీఐ యాప్‌లను రికార్డులను అప్‌డేట్ చేయాలని NPCI ఆదేశించింది. బ్యాంకులు, యూపీఐ యాప్‌లు వారానికి ఒకసారి వారి ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్ల రికార్డులను తనిఖీ చేయాలని కోరింది. యూపీఐ లావాదేవీలకు యాక్టివ్ మొబైల్ నంబర్లు మాత్రమే బ్యాంక్ ఖాతాలతో లింక్ చేయాలనేది దీని లక్ష్యం. ఇలా చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సైబర్ నేరాలు, సాంకేతిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించాలని NPCI లక్ష్యంగా పెట్టుకుంది.