Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ భయాన్ని రుచి చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. బయటకు వెళ్తే, తిరిగి ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అక్కడి ఉగ్రవాదుల్లో ఉన్నాయి. దీంతో కీలకమైన ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్స్ వెళ్లారు. మరికొందరికి పాక్ ఐఎస్ఐ, ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి.
CM Yogi Adityanath: కాంగ్రెస్‌పై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించిందని ఆరోపించారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం కోటాపై మాట్లాడుతూ, ఇది బాబా సాహెబ్ అంబేద్కర్‌కి తీవ్ర అవమానం అని అన్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరు అతడి ప్రేయసి కాగా, మరొకరు అతడి కుటుంబం కుదిర్చిన అమ్మాయి. ఉదయం లవర్ని పెళ్లి చేసుకోగా, సాయంత్రం మరో మహిళను వివాహమాడాడు. ఈ సంఘటన గోరఖ్‌పూర్‌లోని హర్పూర్ బుధాట్ ప్రాంతంలో జరిగింది. ఆ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ రెండో వివాహం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Disha Salian Case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణంపై కేసు తిరిగి ప్రారంభమైంది. జూన్ 8, 2020న ముంబైలో మలాడ్ ప్రాంతంలోని ఓ భవనం 14వ అంతస్తు నుంచి పడి దిశా సాలియన్ మరణించింది. అయితే, ఈ కేసులో దిశ తండ్రి సతీష్ సాలియన్ ముంబై హైకోర్టుని ఆశ్రయించారు
iPhone: ఇటీవల యువత తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని ఓ విధంగా పేరెంట్స్‌ని బ్లాక్మెయిల్ చేసి, తమకు కావాల్సినవి సాధించుకుంటున్నారు. పిల్లల కోరికల్ని తీర్చేందుకు తల్లిదండ్రులు నలిగిపోవాల్సి వస్తోంది. తాజాగా, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నాన్నికి పాల్పడింది. ఈ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో జరిగింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కి అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సోమవారం యూఎస్ కాంగ్రెస్‌లో జో విల్సన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మాజీ సెనెటర్ తన ఫిబ్రవరి డిక్లరేషన్‌లో, సోమవారం అమెరికన్ పార్లమెంట్లో ‘‘పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్’’ని తీసుకువచ్చారు.
New Income Tax Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును చర్చకు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు.
Ranya Rao Case: సినీ నటి, బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రన్యా రావు కేసులు సంచలనం నమోదైంది. బంగారం కొనుగోలుకు హవాలా మార్గాల్లో డబ్బును బదిలీ చేసినట్లు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) న్యాయవాది మధురావు ఈ వాదనను వినిపించారు.
Viral Video: కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను టార్గెట్‌గా చేస్తూ దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా కెనడాలోని కాల్గరీలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Chhattisgarh: మరోసారి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం నక్సలైట్లు , భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 25 లక్షల రివార్డ్ కలిగిన టాప్ కమాండర్‌తో సహా ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు.