Uddhav Thackeray: శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని విమర్శించారు. బీజేపీ కొత్తగా ప్రారంభించిన ‘‘సౌగత్-ఏ-మోడీ’’ పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టి సత్తా జిహాద్(పవర్ జిహాద్)ని ఆశ్రయించిందని ఆరోపించారు. బీజేపీ పథకాన్ని ఠాక్రే ‘‘'సౌగత్-ఎ-సత్తా (అధికార బహుమతి)’’గా అభివర్ణించారు. బీహార్‌లో ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. ‘‘త్వరలోనే పుతిన్ చనిపోతారు’’ అని, ఇది రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని అన్నారు. పారిస్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ పుతిన్ ఆరోగ్యం పరిస్థితులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అతను(పుతిన్) త్వరలోనే చనిపోతారు. ఇది […]
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత్ పర్యటనకు రాబోతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి పుతిన్ భారత్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
Pakistan: వరస దాడులతో పాకిస్తాన్ కుదేలవుతోంది. బలమైన ఆర్మీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పాక్ ఆర్మీ బలం ఇటీవల ఘటనలతో తేలిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దాడులకు తట్టుకోలేకపోతోంది. మొన్నటికి మొన్న బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ చేసిన బీఎల్ఏ ఏకంగా 200కి పైగా ఆర్మీ, ఐఎస్ఐ ఆఫీసర్లను చంపేసింది. ఆ తర్వాత భద్రతా బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 90 మందిని హతమార్చింది.
Bihar: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి దేశ అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’ ఇవ్వాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. లాలూకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బీహార్ అసెంబ్లీ బుధవారం తిరస్కరించింది. బుధవారం ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మరోసారి బీహార్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. బీహార్ ప్రభుత్వం అత్యున్నత అవార్డు కోసం లాలూ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు.
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో బుధవారం ఆగ్రా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన యోగి, తర్వాత వేరే విమానంలో లక్నో చేరుకున్నారు.
UP: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మీరట్ ఎస్పీ విపిన్ టాడా బుధవారం కీలక సూచనలు జారీ చేశారు. ముస్లిం మతాధికారులు, మత పెద్దలు తమ సమీప మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై నమాజ్ చేయడానికి అనుమతి లేదని అన్నారు. Read Also: Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా […]
BJP: బీజేపీని గత కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యాత్నాల్ని బీజేపీ బహిష్కరించింది. పార్టీని, పార్టీ సీనియర్ నేత బీఎన్ యడియూరప్పకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగా 6 సంవత్సరాలు బహిష్కరించింది.
Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, అధికార డీఎంకేని గద్దె దించే లక్ష్యంతో బీజేపీ, ఏఐడీఎంకేలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.