Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరు అతడి ప్రేయసి కాగా, మరొకరు అతడి కుటుంబం కుదిర్చిన అమ్మాయి. ఉదయం లవర్‌ని పెళ్లి చేసుకోగా, సాయంత్రం మరో మహిళను వివాహమాడాడు. ఈ సంఘటన గోరఖ్‌పూర్‌లోని హర్పూర్ బుధాట్ ప్రాంతంలో జరిగింది. ఆ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ రెండో వివాహం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Cyber Fraud : మారని సైబర్ మోసగాళ్ల తీరు.. టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తూ..
ఈ జంట దాదాపు నాలుగు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారని, అంతకుముందు ఆలయంలో వివాహం చేసుకున్నారని, ఆ వ్యక్తి కుటుంబానికి తెలియకుండా కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. తనకు రెండుసార్లు అబార్షన్ అయిందని ప్రియురాలు ఆరోపించింది. కుటుంబం నుంచి పెళ్లికి ఒత్తిడి వస్తుందని చెప్పి, రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుంటే తన కుటుంబం ఒప్పుకుంటుందని, ఆ మహిళను ఉదయం పెళ్లి చేసుకున్నాడు. చట్టపరమైన ఆమోదం తర్వాత అతని కుటుంబం ఈ వివాహాన్ని అంగీకరిస్తుందని ఆశించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ వ్యక్తి కుటుంబం అతడి వివాహానికి ఏర్పాట్లు చేసిన రోజే రిజిస్ట్రర్ మ్యారేజ్ జరిగిందని ఆమెకు తెలియదు. ఆ తర్వాత, అదే రోజు రాత్రి సదరు వ్యక్తి, అతడి కుటుంబం నిశ్చయించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు అతడి ఇంటికి వెళ్లిన సందర్భంలో అతడి కుటుంబం అవమానించి బయటకు వెళ్లగొట్టింది. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిందని, నిందితుడైన వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ చెప్పిందంతా నిజమని తేలిందని వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.