Video: రాజస్థాన్‌లో గూడ్స్ రైలు బొలెరో ఎస్‌యూవీని ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ జవాన్ తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్‌లో, సెక్యూరిటీ లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం దారుణంగా దెబ్బతింది. వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Kaman Bridge: భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి తెరుచుకుంది. భారత్-పాక్ విభజన, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన ఉంది. చాలా ఏళ్ల తర్వాత శనివారం ఈ వంతెనను తిరిగి తెరిచారు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచారు. ఇది రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మానవతా చర్యగా గుర్తించబడింది.
Tech Mahindra: ఖతార్‌లో గుజరాత్‌కి చెందిన భారతీయ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్ట్ రెండు దేశాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ అరెస్ట్ క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. డేటా చౌర్యం కేసులో ఈ అరెస్ట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. టెక్ మహీంద్రా ఖతార్ విభాగానికి అమిత్ గుప్తా సీనియర్ ఉద్యోగిగా ఉన్నారు.
Sambhal mosque: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో హింస చెలరేగింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లి మూక దాడులకు పాల్పడింది. ఈ అల్లర్లలో దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురు మరణించారు, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించి, యూపీ పోలీసులు ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు.
US Store Shooting: అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. వర్జీనియాలోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్‌లో 24 ఏళ్ల ఉర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్‌ని జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టర్(44) అనే వ్యక్తి కాల్చి చంపాడు. కాల్పుల ఘటనలో ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మరణించగా, ఉర్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు వార్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: Meerut Murder: భర్త దారుణహత్య.. జైలులో డ్రగ్స్ […]
Meerut Murder: మీటర్లో హత్యకు గురైన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్, తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తరణంలో మార్చి 04న అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి దారుణంగా హత్య చేశారు. శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. వీరిద్దరని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Onion Exports: 2024 సెప్టెంబర్‌లో ఉల్లిపాయ ఎగుమతులపై విధించిన 20% సుంకాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయంగా ఉల్లిపాయల కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రభుత్వం డిసెంబర్ 2023లో ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, అది నిషేధాన్ని ఎత్తివేసింది కానీ మే 2024లో ఉల్లిపాయలపై 40% ఎగుమతి సుంకాన్ని విధించింది. తరువాత సెప్టెంబర్‌లో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం దానిని 20%కి తగ్గించింది.
New toll policy: "కొత్త టోల్ విధానాన్ని" తీసుకురాబోతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఏప్రిల్ 1 లోపు వినియోగదారులకు సహేతుకమైన రాయితీలతో ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని ప్రవేశపెడుతుందని అన్నారు. శనివారం బిజినెస్ టుడే మైండ్‌రష్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ఈ ప్రకటన చేశారు.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో బెంగళూర్ వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. బెంగళూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సేవలపై ప్రభావం చూపిస్తున్నాయని ఇండిగో ఎక్స్‌లో పేర్కొంది. తమ బృందాలు వాతావరణాన్ని గమనిస్తున్నాయని, పరిస్థితులు మెరుగైన తర్వాత సకాలంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది.
Disha Salian case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి వార్తాంశంగా మారింది. దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కూతురుపై సామూహిత్య అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ, బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు ఉండటం ఇప్పుడు రాజకీయంగా ఈ కేసులు ప్రాధాన్యత