New Income Tax Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును చర్చకు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. ఆమె లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై చర్చలపై సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తుందని ఆమె చెప్పారు. పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటిరోజు సెలక్ట్ కమిటీ తన నివేదిక సమర్పిస్తుందని నిర్మాలా సీతారామన్ అన్నారు.
Read Also: Volkswagen Tiguan R-Line: వోక్స్‌వ్యాగన్ కొత్త SUV త్వరలో మార్కెట్లోకి.. ప్రీ-బుకింగ్ ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలైలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతాయి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని పలు అంశాలను సరళీకృతం చేసి కొత్త బిల్లును తీసుకువస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ ఇంతకుముందు తెలిపింది. కొత్త బిల్లులో పదాల సంఖ్య 2.6 లక్షలు. ఐటీ చట్టంలోని 5.12 లక్షల కన్నా తక్కువ. ప్రస్తుతం చట్టంలో 819 సెక్షన్లకు గానూ సెక్షన్ల సంఖ్య 536గా ఉంది. చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. కొత్తగా తీసుకువస్తున్న ఇన్‌కమ్ టాక్స్ బిల్ -2025లో పాత బిల్లులోని 1200 నిబంధనలు, 900 వివరణలను తొలగించారు.